Begin typing your search above and press return to search.

ఆ విషయంలో తెలుగు రాష్ట్రాలు అంతలా వెనుకబడి పోయాయా?

By:  Tupaki Desk   |   23 Jan 2021 1:30 AM GMT
ఆ విషయంలో తెలుగు రాష్ట్రాలు అంతలా వెనుకబడి పోయాయా?
X
విషయం ఏదైనా సరే.. రెండు తెలుగు రాష్ట్రాలు తమ మార్కును చూపిస్తుంటాయి. చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. మెరుగైన పరిస్థితులకు కేరాఫ్ అడ్రస్ గా తెలుగు రాష్ట్రాలు నిలుస్తాయి. అలాంటిది తాజాగా వెలుగు చూసిన వైనం చూసిన్పుడు ఆయ్యో అనుకోకుండా ఉండలేం. దేశవ్యాప్తంగా బ్యాంకుల విషయానికి వస్తే.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకుల సంఖ్య తక్కువన్న కొత్త విషయం బయటకు వచ్చింది.

తాజాగా విడుదలైన ఆర్ బీఐ నివేదికను పరిశీలిస్తే.. దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల సంఖ్య తక్కువగా ఉండటం గమానార్హం. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ.. ప్రైవేటు.. చిన్నతరహా బ్యాంకులన్ని కలిపి 1,27,014గా ఉన్నాయి. ఇందులో ఏపీ వాటా 4.62 శాతమైతే.. తెలంగాణ వాటా 3.42 శాతంగా చెప్పాలి. విస్తీర్ణం.. జనాభా పరంగా చూస్తే.. తెలుగు రాష్ట్రాల కంటే చిన్నదైన కేరళలో 5962 బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి. అందుకు భిన్నంగా ఏపీలో 5,874 బ్యాంకు బ్రాంచులు ఉంటే.. తెలంగాణలో అంతకంటే తక్కువగా 4355 మాత్రమే ఉండటం గమనార్హం.

జాతీయ స్థాయిలో చూసినప్పుడు ప్రతి 9533 మందికి ఒక బ్యాంకు శాఖ ఉండాల్సి ఉంది. ఆ లెక్కన చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఏపీలో ప్రతి 8407 మందికి ఒక బ్యాంకు ఉంటే.. తెలంగాణలో అంతకంతే తక్కువగా అంటే.. 8081 మందికో బ్యాంకు శాఖ అందుబాటులో ఉన్నాయని తేలింది. మరి.. చాలా రాష్ట్రాల్లో మరిన్ని బ్యాంకులు ఉన్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఉండవన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు?