Begin typing your search above and press return to search.

చైనా రేవుల్లో ఓడలు మాయమైపోతున్నాయా ?

By:  Tupaki Desk   |   27 Nov 2021 8:30 AM GMT
చైనా రేవుల్లో ఓడలు మాయమైపోతున్నాయా ?
X
అవును మీరు చదివింది కరెక్టే కానీ సినిమాల్లో చూపించినట్లు మాయమైపోవటం కాదు. ఇక్కడ మాయమైపోవటమంటే ఆచూకీ తెలియకపోవటమే. ప్రపంచదేశాల నుండి చైనాకు చేరుకుంటున్న సరుకు రవాణా ఓడలను ఆచూకీ తెలుసుకోవటంలో ఆయా దేశాలు ఫెయిలవుతున్నాయి. మామూలుగా తమ దేశాల్లో ఓడలు బయలుదేరిన దగ్గర నుండి సదరు కంపెనీలు ట్రాకింగ్ చేస్తునే ఉంటాయి. జీపీఎస్ లాంటి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్) ద్వారా కంపెనీలు తమ షిప్పులను ట్రాక్ చేస్తుంటాయి.

తమ దేశాల్లో మొదలైన దగ్గర నుండి షిప్పుల ప్రయాణం, వివిధ దేశాల్లో లోడింగ్ అన్ లోడింగ్ వివరాలను ట్రాక్ చేయగలుగుతున్న కంపెనీలకు సడన్ గా ట్రాకింగ్ మిస్సవతోందట. ఓడలు చైనా పరిధిలోకి చేరుకోగానే ఆయా దేశాల ట్రాకింగ్ వ్యవస్ధ పనిచేయటం లేదట. ఇలా ఎందుకు జరుగుతోందో ఆయా దేశాలకు, షిప్పింగ్ కంపెనీలకు అర్ధం కావటంలేదు. జీపీఎస్ ద్వారా కూడా ట్రాక్ చేయచ్చు కానీ అది ఏఐఎస్ ట్రాకింగ్ అంత కచ్చితం కాదని తేలిపోయింది. దాంతో చైనా పరిధిలోకి చేరుకున్న వివిధ దేశాల ఓడలు ట్రాకింగ్ కు చిక్కటం లేదు. దాంతో చాలా దేశాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఇదే విషయాన్ని చైనాను అడిగితే చాలా సింపుల్ గా తీసుకుంటోందట. తమ సముద్ర తీరాలలో ఏర్పాటుచేసిన ఐఏఎస్ స్టేషన్లన్నీ అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే పనిచేస్తున్నాయని చెప్పి చేతులు దులిపేసుకుంటోంది. ఒకవైపేమో యూరోపు దేశాల్లో క్రిస్తమస్ సీజన్ మొదలైపోయింది. సరుకులతో వివిధ దేశాలకు చేరాల్సిన ఓడలు, వివిధ దేశాల నుండి సరుకులను తీసుకెళ్ళాల్సిన ఓడలు చైనా పరిధిలోకి వచ్చేసరికి ఆచూకీ తెలియటకపోవటంతో చాలా దేశాల్లో సమస్యగా తయారైంది.

చైనా ప్రభావం అమెరికా మీద కూడా పడుతోంది. లాస్ ఏంజెల్స్, లాంగ్ బీచ్ పోర్టుల్లో పదులసంఖ్యలో భారీ ఓడలు సరుకుల అన్ లోడింగ్ కోసం రెండువారాలు వెయిట్ చేయాల్సొస్తోందట. ఇలాగే సరుకుల అన్ లోడింగ్ కు చైనాలో రెండు వారాల నుండి ఓడలు వెయిట్ చేస్తున్నాయట. చైనా ఓడరేవుల్లో దాదాపు 20 భారీ ఓడలు రోజుల తరబడి వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. సరుకురవాణాలో ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవుల్లో ఆరు పోర్టులు చైనాలోనే ఉన్నాయి.

ఇపుడు చైనాలో మొదలైన కొత్త సమస్య యావత్ ప్రపంచం మొత్తం మీద పడుతోంది. తమ దేశాల షిప్పుల ఆచూకీ తెలుసుకోవటం కోసం ఆయా దేశాలు ఇపుడు రంగంలోకి దిగాయి. అంటే ప్రత్యేకంగా ఓ బృందాన్ని ప్రతి దేశమూ చైనా పరిధిలోకి రావాల్సుంటుంది. ఈలోగానే ఏఐఎస్ వ్యవస్ధ యాక్టివేట్ అయి ట్రాకింగ్ ద్వారా ఓడల ఆచూకీ దొరికితే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయి. లేకపోతే ఎంతకాలం ఈ సమస్య కంటిన్యు అవుతుందే అంతకాలం ఆయా దేశాలు సమస్యలు ఎదుర్కోవాల్సిందే.