Begin typing your search above and press return to search.

ఉత్తరాఖండ్ వరదలకు అణ్వాయుధాలే కారణమా?

By:  Tupaki Desk   |   23 Feb 2021 3:30 AM GMT
ఉత్తరాఖండ్ వరదలకు అణ్వాయుధాలే కారణమా?
X
ఇటీవల హిమాలయాల్లోని ఉత్తరాఖండ్ లో వరదలు ముంచెత్తి 200 మందికి పైగా మరణించారు. హిమానీనదాలు కరగడం వల్లే ఈ వరదలు వచ్చాయని తేలింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత హిమాలయాల్లో పెట్టిన అణ్వాయుధాల వల్లనే మంచు కరిగి వరదలు వచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని మంచు కొండల కింద జీవించే రెయినీ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఉత్తరాఖండ్ లో జరిగిన నష్టానికి కారణాన్ని తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ప్రాథామికంగా తెలిసిన సమాచారం మేరకు మంచుకొండలు కింద ఉన్న నీటి ఒత్తిడి కారణంగా భూమి కంపించిందని, దాని మూలంగా వరదలు పోటెత్తాయని అంటున్నారు. నందా దేవి పర్వతంపై మంచు చెరియలు విరిగి పడడానికి అక్కడి కొండల కింద శతాబ్దాల తరబడి ఉన్న రాతి ఫలకాలు బలహీనపడడమే కారణం కావచ్చని అంటున్నారు.

ఉత్తరాఖండ్ ఘటనలో 600 మీటర్ల ఎత్తు నుంచి ఒక హిమానీనాద చరియలు విరిగిపడ్డాయని ప్రస్తుతానికి చెప్పొచ్చని, హిమపాతం కూడా ఇందుకు కారణం అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. హిమానీనాద సరస్సు గట్టు వద్ద మంచు చరియలు విరిగిపడి ఉండకపోవచ్చు. ప్రస్తుతం అక్కడే సరస్సులు గట్టకట్టి ఉంటాయి. పైగా ఆ ప్రాంతానికి చేరువలో హిమానీనద సరస్సు ఉన్నట్లు ఉపగ్రహ, గూగుల్ ఎర్త్ చిత్రాల్లోనూ.. వెల్లడి కాలేదు.

అయితే.. హిమానీనదం లోపల చిన్నచిన్న సరస్సులు ఉండొచ్చని పేర్కొన్నారు. భూ తాపం వల్ల ఈ ప్రాంతం వేడి ఎక్కుతుందన్నారు. ఫలితంగా వర్షాపాతం, హిమపాతం లో తేడా ఉంటుందని.. శీతాకాలంలో వేడిగా ఉంటుందని, ఫలితంగా మంచు కరుగుతుందని తెలిపారు.

ప్రపంచంలో అత్యుత్తమ పర్వతరోహకుల్లో కొందరి పేర్లు , ఎలక్ట్రానిక్ గూఢచర్య వ్యవస్థలు పనిచేయడానికి ఉపయోగించే అణుధార్మిక పదార్థాలు ఉంటాయి. చైనా అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాల మీద నిఘా పెట్టేందుకు 1960ల్లో అమెరికా భారతదేశంతో కలిసి ఎలా పనిచేసిందీ.. ఆ క్రమంలో హిమాలయాల మీద అణుధార్మిక శక్తితో నడిచే పర్యవేక్షణ పరికరాలను ఎలా మోహరించిందనే టాక్ ఉంది..

చైనా తన తొలి అణ్వాయుధాన్ని 1964లో పేల్చింది.1965 అక్టోబరులో భారత్, అమెరికాకు చెందిన పర్వతారోహకుల బృందం ఒకటి.. ఏడు ప్లుటోనియం కాప్స్యూళ్లతో పాటు, నిఘా పరికరాలను తీసుకుని హిమాలయాల మీదకు బయలుదేరింది. మొత్తం 57 కిలోల బరువున్న ఈ పరికరాలను.. భారతదేశానికి ఈశాన్యంగా చైనా సరిహద్దులో, భారతదేశంలో రెండో అతిపెద్ద పర్వతమైన 7,816 మీటర్ల ఎత్తున్న నందాదేవి పర్వత శిఖరం మీద మోహరించటం వారి లక్ష్యం. కానీ.. ఆ బృందం శిఖరానికి ఇంకొంచెం దూరంలో ఉండగానే ముంచుకొచ్చిన మంచు తుఫాను కారణంగా వారు పర్వతారోహణను విరమించి వెనుదిరిగాల్సి వచ్చింది. అలా తిరిగివచ్చే క్రమంలో నిఘా పరికరాలను అక్కడే ఒక ''చదరపు బల్ల'' మీద వదిలిపెట్టారు. అందులో.. ఆరడుగల పొడవున్న ఒక యాంటెనా, రెండు రేడియో కమ్యూనికేషన్ సెట్లు, ఒక విద్యుత్ ప్యాక్, ప్లుటోనియం కాప్స్యూళ్లు ఉన్నాయి.

ఆ తర్వాత వేసవిలో మంచు కరిగాక అక్కడికి వెళ్లి చూడగా ఆ పరికరాలు అదృశ్యమయ్యాయి. ఇది జరిగి 50 ఏళ్లు గడిచిపోయాయి. ఈ అణు పదార్థాలు హిమానీ నదం కింద ఉండి వేడి పుట్టించి ఈ మంచు కరిగి ఉత్పాతలకు కారణమవుతోందన్న అంచనాలు ఉన్నాయి. 88 ఏళ్ల పాటు అణుధార్మికత ఉండే ప్లూటోనియం కారణంగా ఇంకో 30 ఏళ్లు పాటు ఈ ఆకస్మిక వరదలు రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.