Begin typing your search above and press return to search.

గెహ్లాట్ మద్దతుదారులు దారిలోకి వస్తున్నారా ?

By:  Tupaki Desk   |   28 Sep 2022 5:34 AM GMT
గెహ్లాట్ మద్దతుదారులు దారిలోకి వస్తున్నారా ?
X
రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఓవరాక్షన్ దెబ్బకు అధిష్టానం ఒక మంత్రిపై వేటు వేసింది. గెహ్లాట్ మద్దతుదారులంతా అధిష్టానాన్నే ధిక్కరించారు. గెహ్లాట్ తర్వాత సీఎంగా ఎవరుండాలనే విషయమై సీఎల్పీ మీటింగ్ ఏర్పాటుచేస్తే దాన్ని సీఎం మద్దతుదారులంతా కలిసి బాయ్ కాట్ చేశారు. ఇదే సమయంలో తన మద్దతుదారులను చూసుకుని, అధిష్టానం బలహీనతను అడ్వాంటేజ్ తీసుకోవాలని గెహ్లాట్ పెద్ద గేమ్ ఆడారు.

తన తర్వాత సీఎంగా ఎవరుండాలనే విషయాన్ని అధిష్టానం కాకుండా తానే డిసైడ్ చేస్తానని, తాను ఎంపిక చేసిన నేతనే సీఎంగా ప్రకటించాలని ఏకంగా అధిష్టానానికే కండీషన్ పెట్టారు. దాంతో సీఎల్పీ సమావేశం బాయ్ కాట్ చేయటం గెహ్లాట్ గేమ్ లో భాగమే అని సోనియా+సీనియర్లందరికీ అర్ధమైపోయింది. దాంతో ఒక్కసారిగా సీన్ రివర్సయిపోయింది. ఇపుడు అధ్యక్ష పదవి రేసులో గెహ్లాట్ వెనకబడిపోవటంతో పాటు సీఎం కుర్చీని కూడా ఖాళీ చేయాల్సొచ్చేట్లుంది.

ఇందులో భాగంగానే సీఎం మద్దతుదారుడైన మంత్రి ప్రతాప్ సింగ్ ను అధిష్ఠానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ దాటినా, ధిక్కారాన్ని వినిపించినా ఎవరిపైనైనా సరే యాక్షన్ తీసుకునేందుకు వెనకాడేది లేదనే సంకేతాలను అధిష్టానం పంపింది.

దాంతో గెహ్లాట్ మద్దతుదారుల్లో కాస్త కలవరం మొదలైంది. మంత్రి ప్రతాప్ సింగ్ నే సస్పెండ్ చేసినపుడు ఇక తమపైన యాక్షన్ తీసుకోవటం పెద్ద కష్టంకాదన్న విషయం ఎంఎల్ఏలకు అర్ధమైంది. దానికితోడు మరికొందరిపైన కూడా సస్పెన్షన్ వేటుపడే అవకాశముందనే ప్రచారం మొదలైంది.

దాంతో మంత్రులు, ఎంఎల్ఏలందరు దారిలోకి వస్తున్నారు. సోనియాగాంధీకి జిందాబాద్ కొట్టి అధిష్టానం ఎలాచెబితే అలా నడుచుకుంటామంటు ప్రకటనలు చేస్తున్నారు. దాంతో గెహ్లాట్ వారసుడిగా సచిన్ పైలెట్ కు మార్గం సుగమం అయినట్లే అని అనుకుంటున్నారు.

నిజానికి గెహ్లాట్ స్ధానంలో సచినే ఎప్పుడో సీఎం అయ్యుండాల్సింది. కానీ ఇపుడు అవకాశం వస్తున్నట్లు అనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మంత్రులు, ఎంఎల్ఏలందరు దారిలోకి వచ్చేస్తే అప్పుడు సచిన్ పేరును అధిష్టానం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.