Begin typing your search above and press return to search.

బైక్ ల‌పై వెళ్లేట‌ప్పుడు శ‌బ్ధాలు ఎక్కువైతే ఐఫోన్ కెమెరాలు ఖ‌త‌మే

By:  Tupaki Desk   |   14 Sep 2021 1:03 PM GMT
బైక్ ల‌పై వెళ్లేట‌ప్పుడు శ‌బ్ధాలు ఎక్కువైతే ఐఫోన్ కెమెరాలు ఖ‌త‌మే
X
పెద్ద శబ్దాలతో స్పీడ్‌గా దూసుకెళ్లే బైక్‌ల నుంచి వచ్చే వైబ్రేషన్లతో ఐఫోన్ యూజర్లు ఎప్ప‌టిక‌ప్పుడు అప్రమత్తంగా ఉండాలని యాపిల్ సంస్థ పేర్కొంది. యాపిల్ ఫోన్ల కెమెరా సిస్టం ఈ వైబ్రేషన్లతో దెబ్బతినే ముప్పు ఉందని హెచ్చరించింది. వేగంగా కదిలే శక్తిమంతమైన బైక్‌లపై ఐఫోన్లను జీపీఎస్ సేవల కోసం పెట్టకూడదని సంస్థ ఓ ప్రటకనను విడుదల చేసింది. వైబ్రేషన్లతో ఐ ఫోన్లలోని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదా క్లోజ్డ్ లూప్ ఆటోఫోకస్ సిస్టమ్ వ్యవస్థలు దెబ్బతింటాయి’’ అని ప్రకటనలో వివ‌రించారు. ఫోన్లను తమ వాహనాలపై పెట్టే స్కూటర్లు, మోపెడ్ డ్రైవర్లు కూడా వైబ్రేషన్ల తీవ్రతను తగ్గించే పరికరాలను ఉపయోగించాలని యాపిల్ సూచించింది.

జీపీఎస్ సహాయం కోసం బైక్‌కు అమర్చడంతో తమ మొబైల్ ఫోన్లు దెబ్బతిన్నాయని చాలా మంది ఐఫోన్ క‌స్ట‌మ‌ర్లు సోషల్ మీడయాలో పోస్ట్‌లు చేస్తున్నారు. దీంతో యాపిల్ సంస్థ స్పందించింది. కొన్ని ఐఫోన్ మోడల్స్.. ఇలా దెబ్బతినే ప్ర‌మాద‌ముంద‌ని యాపిల్ సూచించింది. ఫోన్ కదలికలు, వైబ్రేషన్లు, భూమి గురుత్వాకర్షణల ఎఫెక్ట్ ఫోటోలపై పడకుండా చూసేందుకు ఐ ఫోన్లలో కొన్ని ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. వీటినే ద్విచ‌క్ర వాహ‌నాలు దెబ్బతీస్తున్నాయి. ‘‘భారీ శబ్దాలతో వేగంగా దూసుకెళ్లే బైక్‌ల నుంచి శక్తిమంతమైన వైబ్రేషన్లు వస్తుంటాయి. ఇవి ఫ్రేమ్‌లు, హ్యాండిల్‌బార్స్ గుండా ఫోన్‌లోకి చొచ్చుకెళ్తుంటాయి’’అని ప్రకటనలో యాపిల్ సంస్థ వివ‌రించింది.

ఇలాంటి శక్తిమంతమైన వైబ్రేషన్లకు సమీపంలో ఫోన్లు ఉంటే వాటిలోని కీలకమైన వ్యవస్థలు దెబ్బతింటాయి. ఫలితంగా ఫోటోలు, వీడియోల నాణ్యత తగ్గిపోతుంద‌న్నారు. అందుకే, జీపీఎస్ సేవల కోసం బైక్‌లపై ఫోన్‌లు పెట్టకూడద‌న్నారు. అయితే ఈ మ‌ధ్యా కాలంలో చాలా మంది బైక్ వినియోగ‌దారులు జీపీఎస్ ట్రాక్‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే ఇది ఉప‌యోగించ‌డం మూలంగా బైక్‌ల నుంచి వైబ్రేష‌న్ల‌తో ఇది దెబ్బ‌తింటుంన్న‌ద‌ని ఆ సంస్థ పేర్కొంది. ఈ స‌మ‌స్య ఒక్క యాపిల్ సంస్థ‌కే కాదు. మొత్తం అన్ని ఫోన్ల‌లోనూ ఇటువంటి స‌మ‌స్య ఉంద‌ని వారు వివ‌రించారు. జీపీఎస్ ట్రాకింగ్ కోసం ఫోన్ల‌న్ బైక్ ఉంచ‌కూడ‌ద‌ని వివ‌రించారు.

ఒక వేళ ఉంచ‌డం వ‌ల్ల ఆ ఫోన్ల‌లోని కెమెరాలు దెబ్బ‌తింటాయ‌న్నారు. అందువ‌ల్ల క‌స్ట‌మ‌ర్లు ఎప్పుడూ ఫోన్ల ను జీపీఎస్ ట్రాకింగ్ కోసం ఇలా చేయ‌డం వ‌ల్ల ఫోన్ల విస‌యంలో చాలా న‌ష్ట‌పోతార‌ని వివ‌రించారు. అందువ‌ల్ల వాటి కోసం వేరే ప్ర‌త్యేక‌మైన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. ముఖ్యంగా యాపిల్ ఫోన్లు దెబ్బ‌తింటాయ‌ని చెప్పారు. ఈ ఫోన్లు దెబ్బ‌తినడం వ‌ల్ల యూజ‌ర్స్ చాలా న‌ష్ట‌పోతార‌ని చెప్పారు. ఫోన్ యొక్క విడిభాగాలు కొనేందుకు చాలా డ‌బ్బులు చెల్లించాల్సి వ‌స్తుంద‌ని వారు అన్నారు. అందుకే వాడేట‌ప్పుడే చాలా జాగ్ర‌త్త‌గా వాడాల‌ని సూచించారు.