హైవేపై నిలిచిపోయిన 'యాపిల్' ట్రక్కులు..

Fri Sep 30 2022 10:29:48 GMT+0530 (India Standard Time)

Apple Trucks Stuck on the Highway

దేశమంతా తినే యాపిల్స్ అన్నీ మన కశ్మీర్ నుంచే వస్తాయి. అక్కడ విరివిగా పండే యాపిల్స్ ను ట్రక్కుల్లో దేశంలోని రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అయితే ఇప్పుడు జమ్మూకశ్మీర్ జాతీయ రహదారిపై వేలాది యాపిల్స్ ట్రక్కులు ఇరుక్కుపోయాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.జాతీయ రహదారులపై ఈ ట్రాఫిక్ జామ్ వెనుక అనేక కారణాలు ఉన్నాయి. హైవే నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఈ భారీ ట్రక్కులను నిలిపేశారు. కొందరి ఫిర్యాదు తర్వాత కూడా పోలీసులు  ట్రాఫిక్ నియంత్రించడం లేదు.

రైతులు ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చిన్న మరియు మధ్యస్థ శ్రేణి వాహనాలు హైవేలపై సజావుగా కదులుతున్నాయని అయితే యాపిల్స్.. ఇతర పండ్లను తీసుకువెళుతున్న ట్రక్కులను ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని ఆరోపిస్తున్నారు.  దాదాపు 10 నుండి 12 రోజులనుంచి ఈ ట్రక్కులు రోడ్లపైనే నిలిపేశారు. అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతూ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

దాదాపు 8000 ట్రక్కులు ఇలా హైవే పక్కన నిలిచిపోయాయి. డ్రైవర్లు మరియు రైతులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. యాపిల్స్ చెడిపోయి నష్టపోతామన్నా  జమ్మూకశ్మీర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎట్టకేలకు రైతుల ఆందోళనతో పరిపాలన యంత్రాంగం కదిలింది. గురువారం రాత్రి దాదాపు 4000 ట్రక్కులకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.

హైవేపై చిక్కుకున్న ఆపిల్ ట్రక్కుల వీడియోలు ఫొటోలు వైరల్ అయ్యాయి.  అనంత్‌నాగ్‌లోని మీర్‌బజార్ నుండి బనిహాల్ సొరంగం వరకు 40 కిలోమీటర్ల పొడవునా ఉన్న దిశలో భారీ ట్రక్కుల వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అయ్యింది.

జమ్మూ కాశ్మీర్ పరిపాలన వైఫల్యానికి నిరసనగా అధికారుల కుట్రను అనుమానిస్తూ కాశ్మీర్ అంతటా హోల్‌సేల్ పండ్ల మార్కెట్‌లు మూసివేయబడ్డాయి. కాశ్మీర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా యాపిల్ సాగుపై ఆధారపడి ఉంది.  రైతులు దీనిని తమ జీవనోపాధిపై దాడిగా పేర్కొన్నారు.

ఇలా యాపిల్ ట్రక్కులను ఎందుకు నిలిపేశారు? దీనికి వెనుక కుట్ర ఏంటన్నది తెలియడం లేదు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.