ఏపీ బీపీ : ధర్మానతో నష్టం..బొత్సతో లాభం ఎలా అంటే?

Sun May 22 2022 07:00:01 GMT+0530 (IST)

Ap Politics on Dharmana And Botsa

విభజన కారణంగా రాష్ట్రంలో ఇద్దరంటే ఇద్దరు నేతలు తీవ్రంగా నష్టపోయారు. ఒకరు ధర్మాన అయితే మరొకరు బొత్స. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వీరిద్దరూ ఒకప్పుడు ఉండేవారు. ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్రలో వైఎస్సార్ ను నమ్ముకుని రాజకీయం చేసిన వారిలో వీరిద్దరే అగ్రగణ్యులు. అంతకుముందు  పెనుమత్స సాంబశివరావు ఉండేవారు కానీ తరువాత కాలంలో బొత్స సత్యనారాయణ ఆగమనం తిరుగే లేని విధంగా రాణించిన వైనం ఇవన్నీ కూడా విజయనగరం రాజకీయాల్లో పెను మార్పులకు కారణం అయింది.ఆ విధంగా బొత్సకు రాజుల కుటుంబాలకు కాస్త దూరాలు ఉన్నాయి. కానీ అశోక్ తో మాత్రం ఓ విధంగా మంచి స్నేహమే ఉంది. ఆయనకు విజయనగరం రాజుల్లో గజపతి రాజులంటే ఇష్టమే కానీ బొబ్బిలి రాజులంటే మాత్రం పెద్దగా పడదు. ఎందుకనో ఆయన్ను వాళ్లు ఓన్ చేసుకోరు. కానీ విజయనగరం రాజకీయాల్లో బొత్స హవాను వాళ్లేపాటీ నిలువరించలేకపోయారు అన్నది వాస్తవం. ఇంకొంచెం ముందుకు వెళ్లి ఆలోచిస్తే పార్వతీపురం  పెద్దలు కాస్త బొత్సతో బాగుంటారు. గిరిజన నేతలుగా పేరున్న కిశోర్ చంద్రదేవ్ హవా బాగున్న రోజుల్లో కూడా బొత్స బాగున్నారు.

ఇప్పుడు అక్కడ గిరిజన తండాల్లో బొత్సకు ఓ విధంగా వీర విధేయ వర్గాలు కొన్ని ఉన్నాయి. ఆ వర్గాలు అటు జగన్ కూ ఇటు బొత్సకూ మేలు చేస్తూనే  ఉన్నాయి. ఆ విధంగా బొత్సకు కొంత సానుకూలం ఉన్నది. అదేవిధంగా వ్యతిరేకం కూడా ఉన్నది. శ్రీకాకుళం పై కూడా బొత్సకు పట్టుంది. ఇప్పుడు విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నా రాజాం కానీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగుతున్న ఎచ్చెర్ల పై కానీ బొత్సకు పట్టుంది. కాల గతిలో అది పెరిగింది కానీ తగ్గలేదు. ఆ విధంగా టీడీపీ జనసేన పొత్తులున్నా కూడా బొత్స మాత్రం ఇక్కడ తన మనుషులను గెలిపించుకోగలరు.

ఆ విధంగా 2 నియోజకవర్గాలతో పాటు పాలకొండ పై కూడా కాస్తో కూడా  అవగాహన ఉన్న నేత బొత్స. అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే మూడు స్థానాలపై ప్రభావితం చేయగలరు. కానీ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం ఆయన ప్రభావితం చేయనే లేరు. అదేవిధంంగా ధర్మానతో నష్టం ఏంటంటే సొంత మనుషులు ఎదుగుదలకు ఎక్కువ సార్లు ఆయన ప్రాధాన్యం ఇవ్వరు. కొన్నిసార్లు కొత్త ముఖాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలనీ చూస్తారు. అదేవిధంగా ఎర్రన్న కుటుంబంతో ఉన్న దోస్తీ కూడా ఓ విధంగా సోషల్ మీడియాలో ఫోకస్ అవుతూనే ఉంది. కనుక ధర్మాన ప్రభావితం చేసే నియోజకవర్గాలు రెండంటే రెండు. వాటిలో ఒకటి అన్న చూసుకుంటున్నారు. అదే నరసన్నపేట. దాసన్నకు ప్రసాదరావుకు మధ్య చెప్పుకోదగ్గ తగాదాలు  ఉన్నా లేకున్నా రానున్న కాలంలో రాజకీయంగా రాణించే అవకాశాలు ప్రసాదరావుకూ తక్కువే !దాసన్నకూ తక్కువే ! అందుకే రాజకీయ వారసులను తయారు చేస్తున్నారు. కానీ వీరు కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో !

ఆ మాటకు వస్తే బొత్స సందీప్ (బొత్స సత్తిబాబు కొడుకు) కూడా రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు కృషి చేస్తున్నవాడే ! కానీ వీళ్లంతా ఇప్పటికిప్పుడు రాణించకపోయినా రేపటి వేళ తమ  ఎదుగుదలకు కొన్ని రాజకీయ శక్తులను స్థిరం చేసుకోవాలి.. ఆ విధంగా కావాలంటే ఎదగాలంటే వీళ్ల తండ్రులు తక్కువ తప్పులు చేయాలి..గెలుపు ఓటమికి అతీతంగా రాణించగలగాలి.

కానీ బొత్స తో కానీ ధర్మానతో కానీ కొన్నిసార్లు ఇవేవీ కుదరవు. ఓ విధంగా పదవి ఉన్నా లేకపోయినా బొత్స కొంతలో కొంత అయినా యాక్టివ్ గా ఉంటారేమో కానీ పదవి లేకపోతే ధర్మాన ప్రసాదరావు ఉండరు గాక ఉండరు అన్నది గతంలోనే నిరూపణ అయింది. ఏదేమయినప్పటికీ కాపు సామాజికవర్గంకు చెందిన లీడర్ గా ఇప్పట్లో బొత్స కారణంగా వైసీపీకి జరిగే నష్టం పెద్దగా లేదు. కానీ ధర్మాన కారణంగా శ్రీకాకుళంలో గెలుపు అవకాశాలు ఎంతన్నవి ఇప్పటికిప్పుడు తేల్చలేం.

కొత్త ముఖాలను ధర్మాన ఇప్పటి నుంచే ప్రోత్సహించాలి కానీ ఆ పని ఆయన చేయరు. సొంత మనుషులను నమ్మి గతంలో చెడ్డారు. మళ్లీ ఆ తప్పే చేస్తూ ఉన్నారు కనుక ఆయన కారణంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన కారణంగా జగన్ తక్షణ లబ్ధి అయితే పొందరు.. పొందలేరు కూడా ! అన్నది ఓ పరిశీలన.