Begin typing your search above and press return to search.

ఏపీ రాజధాని అంశం : అక్టోబర్‌ 5 కి విచారణ వాయిదా వేసిన హైకోర్టు !

By:  Tupaki Desk   |   21 Sep 2020 12:10 PM GMT
ఏపీ రాజధాని అంశం : అక్టోబర్‌ 5 కి విచారణ వాయిదా వేసిన హైకోర్టు !
X
ఏపీ‌ రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్ల పై ఏపీ హైకోర్టు విచారణ ను వచ్చే నెల‌ 5కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రాజధానిపై ఉన్న స్టేటస్ ‌కో అక్టోబర్‌ 5 వరకు పొడిగిస్తూ ఆదేశం జారీ చేసింది. అక్టోబర్ 5 నుండి రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. సాంకేతిక కారణాల వల్లే ఈ పిటిషన్ల పై హైకోర్టు విచారణను వాయిదా వేసినట్లు తెలిసింది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే... వెంటనే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చెయ్యాలనుకున్న ఏ ప్రభుత్వానికి ఈ స్టేటస్ కో ఆదేశం మళ్లీ అడ్డంకిగా మారింది.

రాజధాని అమరావతి ప్రాంత రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్ ‌ఏ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్‌ లపై ఇవాళ్టి నుంచి ఏపీ హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని ముందుగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైకోర్టు ముందు మొత్తం 93 పిటిషన్లు ఉన్నాయి. తాజాగా ఈ విచారణ వాయిదా పడటంతో అక్టోబర్ 5 నుంచి ఈ 93 పిటిషన్ల పై విచారణ జరిగే అవకాశం ఉంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్‌ రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్దతపై రాజధాని రైతులు కేసులు వేశారు. CRDA రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంఘనపై కేసులు నమోదయ్యాయి. అలాగే రాజధానిలో మాస్టర్ ప్లాన్ డివియేషన్‌పైనా, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడం పైన రైతులు కేసులు వేశారు. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 CRPC విధింపును ఛాలెంజ్ చేశారు రాజధాని ప్రాంత రైతులు. పరిపాలన రాజధాని తరలింపు కోసం చేసిన చట్టంపై ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో విధించింది.

ఇలా రాజధానికి సంబంధించిన కేసులు, దాఖలైన పిటిషన్లపై ఆన్ ‌లైన్ ద్వారా విచారణ కూడా వాయిదా పడింది. మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తదుపరి చర్యలను అడ్డుకోవాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గెజిట్ ను నిలిపివేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ ను కోర్టులో దాఖలుచేశారు. జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్ ‌లో పొందుపరిచారు. సిఆర్డిఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో శాసనససభ రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.