Begin typing your search above and press return to search.

స్థానికంపై సుప్రీంకు ఏపీ‌.. ఊర‌ట ల‌భించేనా?

By:  Tupaki Desk   |   22 Jan 2021 3:40 AM GMT
స్థానికంపై సుప్రీంకు ఏపీ‌.. ఊర‌ట ల‌భించేనా?
X
రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై అటు ఎన్నిక‌ల క‌మిష‌న్‌, ఇటు ప్ర‌భుత్వం మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం మ‌రోసారి సుప్రీం కోర్టుకు చేరింది. గ‌త ఏడాది కూడా ఇదే విష‌యంపై సుప్రీం కోర్టుకు ప్ర‌భుత్వం వెళ్లిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ చేప‌ట్టాలంటూ.. ప్ర‌భుత్వం సుప్రీం కు వెళ్ల‌గా.. ఇప్పుడు ఎన్నిక‌లు వాయిదా వేయాలంటూ.. కోర్టుకెళ్ల‌డం గ‌మ‌నార్హం స‌రే! మ‌ధ్య‌లో జ‌రిగిన‌ప‌రిణామాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ‌ర‌మేష్ కుమార్ షెడ్యూల్ ఇచ్చిన త‌ర్వాత‌.. కూడా ఎన్నిక‌ల‌కు సిద్ధంగా లేమ‌ని స‌ర్కారు వాదించింది.

ఈ క్ర‌మంలోనే షెడ్యూల్ ఇచ్చిన త‌ర్వాత హైకోర్టు కు వెళ్లిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నంలో అనుకూల తీర్పు వ‌చ్చింది. అయితే.. దీనిని క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ .. స‌వాలు చేయ‌డంతో ప్ర‌ధాన న్యాయ ‌మూర్తి నేతృత్వంలోని ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం విచారించి.. తీర్పు చెప్పింది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల విష ‌యంలో ప్ర‌భుత్వం, క‌మిష‌న్ కూడా సానుకూల స‌హ‌కారంతో వ్య‌వ‌హ‌రించాల‌ని తీర్పు చెప్పింది. ఎన్ని క‌లు, వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌లు రెండూ ముఖ్య‌మేన‌ని.. వాటిని కొన‌సాగించాల‌ని కూడా ధ‌ర్మాసనం పేర్కొంది. అయితే.. ఎన్నిక‌లు వాయిదా వేయించ‌డ‌మే ల‌క్ష్యంగా ఏపీ స‌ర్కారు దీనిని సుప్రీంలో స‌వాల్ చేసింది.

కానీ.. సుప్రీంలో ఇప్పుడున్న ప‌రిస్థితి, గ‌త తీర్పుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ప్ర‌భుత్వానికి సానుకూల తీర్పు, ఉప‌శ‌మ‌నం ల‌భించే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్నాళ్ల కింద‌ట కేర‌ళ కూడా ఇలానే వాయిదా కోరుతూ.. సుప్రీం గ‌డ‌ప తొక్కింది. కానీ, సుప్రీం ఎన్నిక‌ల‌ను వాయిదా వేసేందుకు స‌సేమిరా అంది. పైగా ఇప్పుడు ఏపీలో షెడ్యూల్ కూడా విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. ఈ నెల 23న నోటిఫికేష‌న్ కూడా ఇచ్చేందుకు క‌మిష‌న‌ర్ సిద్ధ‌మైన నేప‌థ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వ‌డం అనేది అసంభ‌వ‌మేన‌ని.. ఏదైనా సంచ‌ల‌నం జ‌రిగితే.. త‌ప్ప ప్ర‌భుత్వానికి ఊర‌ట‌ల‌భించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు న్యాయ నిపుణులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.