Begin typing your search above and press return to search.

అందరికి వరాలు ఇచ్చి.. వీరికి ఈ షాకులేంది జగన్?

By:  Tupaki Desk   |   1 Dec 2021 4:30 PM GMT
అందరికి వరాలు ఇచ్చి.. వీరికి ఈ షాకులేంది జగన్?
X
ప్రజల మనసుల్ని ఎలా దోచుకోవాలి? సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంతటి ఆర్థిక కష్టంలో ప్రభుత్వం ఉన్నప్పటికి.. బడుగు.. బలహీన వర్గాలకు అందాల్సిన ప్రభుత్వ సాయాన్ని ఠంఛన్ గా అందించటమే కాదు.. అంతకు మించి వారికి ఇవ్వని హామీలకు సంబంధించిన వరాల్ని ఇస్తున్న మారాజుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు. ఈ కారణంతోనే ఏపీ విపక్షం తీవ్ర స్థాయిలో ప్రభుత్వ విధానాల మీద విరుచుకుపడుతున్నా.. భారీగా అప్పలు తెస్తుందని గొంతు చించుకుంటున్నా.. పేదల నుంచి ఎలాంటి ప్రతి స్పందన లేని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం.

ఇలా అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడిగా మారిన ఏపీ సీఎం జగన్.. కొందరి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారన్న పేరుంది. అందుకు తగ్గట్లే తాజాగా హాట్ టాపిక్ గా మారిన ఒక ఇష్యూను ప్రస్తావిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పుతో ఇంటిని నిర్మించుకున్న వేళ.. ఇప్పుడా పాత అప్పు పేరుతో అధికారులు వేధిస్తున్న వైనంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నిరుపేదల్ని రూ.10 వేలనుంచి రూ.20వేల చొపమపున కట్టాలని.. వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటూ వాలంటీర్లు .. ఇతర అధికారులు ఇళ్ల వద్దకు బెదిరింపులకు దిగుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వారంతా హడలిపోతుననారు. వాలంటీర్లను విపరీతంగా బతిమిలాడుకుంటే తప్పించి.. ఇల్లు దక్కదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ మధ్యనే ఏపీ ప్రభుత్వం వన్ టైం సెటిల్ మెంట్ పథకాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా తొలుత.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు.. పట్టణాల్లో అయితే రూ.20 వేలు ఇస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు. ఇలా కట్టిన వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెబుతున్నారు. ఇలా ఉచితం కోసం పెట్టి ఇంత భారీగా డబ్బులువసూలు చేయటం ఏమిటన్న విమర్శ ఈ మధ్యన ఎక్కువైంది. మొక్కలో ఉన్నప్పుడే వ్యతిరేకతను వేరుతో సహా పీకాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం తేడా చేసినా.. ఇవన్నీ కష్టమైన పనులుగా మారటం ఖాయం.