Begin typing your search above and press return to search.

కూతురి ఫొటో రివీల్ పై స్పందించిన అనుష్క

By:  Tupaki Desk   |   24 Jan 2022 10:31 AM GMT
కూతురి ఫొటో రివీల్ పై స్పందించిన అనుష్క
X
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క దంపతుల కూతురు వామిక ఫొటోలు నిన్న లిక్ అయిన సంగతి తెలిసిందే.విరాట్ కోహ్లి - అనుష్క శర్మ కుమార్తె వామిక తన తండ్రితో కలిసి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సిరీస్ కోసం వెళ్లారు. తాజాగా విరాట్ హాఫ్ సెంచరీ చేయడంతో బాల్కనీలో తల్లి అనుష్కతోపాటు వామిక చప్పట్లు కొట్టింది. దాన్ని కెమెరాలు ప్రసారం చేయడంతో వామిక ఫొటో బయటకు వచ్చింది. స్టాండ్స్‌లో అనుష్క వామికను పట్టుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. కెమెరామెన్ లు దాన్నే ఫోకస్ చేయడంతో చాలా మంది నెటిజన్లు ఇంటర్నెట్‌లో లీక్ అయిన క్షణాన్ని పంచుకున్నారు.

మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో అనుష్క చేతుల్లో పసిపాప ఉంది. గతంలో విరాట్ -అనుష్క ఇద్దరూ వామిక ఫొటోలు బయటకు రాకుండా దాచేశారు. ఇతరులు తమ గోప్యతను గౌరవించాలని అభ్యర్థించారు. వారి బహిరంగ ప్రదర్శనలపై వామికాను క్లిక్ చేయవద్దని కోరారు. వామిక ముఖం కనిపించకుండా దాచేశారు. ఆమె ముఖాన్ని చిత్రాలలో చాలాసార్లు అస్పష్టం చేశాయి.

అయితే ఈ సమయంలో మ్యాచ్ లో వామిక కనిపించడంతో ఇంటర్నెట్ వినియోగదారులు మొదటిసారి వామిక ముఖాన్ని బహిర్గతం చేస్తూ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసారు. వామిక చాలా అందంగా కనిపించడమే కాదు, అక్షరాలా విరాట్ కోహ్లీ జిరాక్స్ కాపీలా ఉంది. ఆమె చిత్రాన్ని విరాట్ చిన్ననాటి చిత్రంతో పోల్చినప్పుడు నమ్మడం చాలా కష్టం. ఇద్దరూ సేమ్ యాజ్ టీజ్ గా ఉన్నారు. నిస్సందేహంగా మంచి లుక్స్ తో కనిపిస్తోంది. విరాట్ పోలికే వామికకు వచ్చింది.

అయితే తాజాగా కూతురి ఫొటో బయటకు రావడంపై తల్లి అనుష్క శర్మ స్పందించింది. ‘మా కుమార్తె ఫొటోలు క్యాప్చర్ కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని తెలిసింది. ఆ సమయంలో కెమెరా మాపై ఉందని నాకు తెలియదు.. వామిక గోప్యత విషయంలో మొదట్లో చెప్పినట్లే మా వైఖరి ఉంటుంది. మా నిర్ణయాన్ని గౌరవించి ఫొటోలు డిలీట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ అని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది.

అనుష్క విజ్క్షప్తితో చాలా మంది నెటిజన్లు, పలు వెబ్ సైట్లు వామిక ఫొటోలు డిలీట్ చేశారు.కొందరు బ్లర్ చేసి కనిపించకుండా చేశారు. అయినా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.