Begin typing your search above and press return to search.

మాజీ మిస్‌ కేరళ మృతి కేసు : దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు

By:  Tupaki Desk   |   24 Nov 2021 5:46 AM GMT
మాజీ మిస్‌ కేరళ మృతి కేసు : దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు
X
మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌, రన్నరప్‌ అంజనా నిజంగా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారా, దీనిపై అనేక అనుమానాలు ఉన్నా.. వాస్తవం ఇంకా తెలియడం లేదు. రోడ్డు ప్రమాదం వెనుక డ్రగ్‌ మాఫియా కుట్ర ఉన్నట్టు సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి.

ముఖ్యంగా పోలీసుల దర్యాప్తు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల మాజీ మిస్ కేరళ, మాజీ రన్నరప్ అంజనా షాజన్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణిస్తున్న కారు, రోడ్డు పై ఓ బైక్ ను తప్పించే ప్రయత్నంలో చెట్టును ఢీకొని నుజ్జునుజ్జయింది. వేగంగా వెళ్లే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం, జరిగిందని అందరూ భావించారు.

పోలీసుల దర్యాప్తు లో మాత్రం అనేక అనమానాలు పుట్టుకొస్తున్నాయి. ఈ ప్రమాదం కేసుకు డ్రగ్ మాఫియా లీడర్ కు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ దిశగానే పోలీసుల విచారణ సాగుతోంది. నవంబర్‌ 1న కేరళలోని కొచ్చి సమీపంలో జరిగిన అన్సీ కబీర్‌, అంజనాలు అక్కడిక్కడే మృతి చెందారు.. మొదట ప్రమాదంగానే కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలను గుర్తించినట్టు తెలుస్తోంది.

అన్సీ, అంజనా ప్రయాణిస్తున్న కారు ను మరో కారు వెంబడించిందని, దాన్నుంచి తప్పించుకునే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. అన్సీ కబీర్‌, అంజనా కారును వెంబడించింది డ్రగ్ మాఫియా గ్యాంగ్‌స్టర్ సైజు థంకచ్చన్ అని పోలీసులు గుర్తించారు.

బైక్‌ ను తప్పించే ప్రయత్నంలో అన్సీ కబీర్‌, అంజనా ప్రయాణం చేస్తున్న కారు చెట్టును ఢీకొట్టినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ, డ్రగ్‌ మాఫియా డాన్‌ థంకచ్చన్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నం లోనే వీళ్ల కారు ప్రమాదానికి గురైనట్టు చెబుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో అన్సీ కబీర్‌, అంజనాలు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే, ప్రమాదానికి ముందు ఇద్దరు కూడా ఫోర్ట్‌ కొచ్చి ప్రాంతంలో ఉన్న హై ఎండ్‌ హోటల్‌ నంబర్‌ 18లో ఓ పార్టీ హాజరైనట్లు పోలీసులు తెలిపారు. హోటల్‌లో విందు ముగిసిన తరువాత తనతో రావాల్సిందిగా సైజు ఇద్దరు మోడల్స్‌ని ఆహ్వానించాడని తెలుస్తోంది. కానీ, అన్సీ కబీర్‌ , అంజనా అందుకు అంగీకరించలేదు. హోటల్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇద్దరిని సైజు ఫాలో అయ్యాడు.

ఈ క్రమంలో ప్రమాదం జరిగి అంజనా, అన్సీ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పార్టీ జరిగిన హోటల్‌ యజమాని రాయ్ వాయలత్‌ తో పాటు కొందరిని ప్రశ్నించారు. వారు కూడా విచరాణలో కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే హోటల్‌లో అంజనా, అన్సీ పాల్గొన్న పార్టీ సీసీటీవీ ఫుటేజ్‌ మాయం కావడం పలు అనుమానాలు తావిస్తోంది. కొచ్చి సమీపం లోని చెరువులో సీసీటీవీ హార్డ్‌డిస్క్‌ను పడేసినట్టు హోటల్‌ సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో చెరువులో హార్డ్‌డిస్క్‌ కోసం పోలీసులు గాలించారు.

స్కూబా డైవర్స్‌ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నడ్రగ్ లీడర్ సైజు థంకచ్చన్ కోసం కేరళ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. థంకచ్చన్ కు కొచ్చిలో మాదకద్రవ్యాల సరఫరాదారులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు