Begin typing your search above and press return to search.

మ‌రో వైర‌స్ ముప్పు.. ఈసారి నైరోబీ ఫ్లై!

By:  Tupaki Desk   |   7 July 2022 8:30 AM GMT
మ‌రో వైర‌స్ ముప్పు.. ఈసారి నైరోబీ ఫ్లై!
X
కోవిడ్ వైర‌స్ తో గ‌త రెండేళ్లు మ‌న‌దేశంతో స‌హా ప్ర‌పంచ దేశాల‌న్నీ అల్ల‌క‌ల్లోల‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డ్డారు. మ‌న‌దేశంలోనూ ల‌క్ష‌ల్లో మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. కోవిడ్ వైర‌స్ లోనే ర‌క‌ర‌కాల వేరియంట్లు వెలుగుచూసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోవిడ్ క‌ల్లోలం నుంచి ప్ర‌జ‌లు తేరుకుంటున్నారు. సాధార‌ణ కార్య‌క‌లాపాలు వేగం పుంజుకుంటున్నాయి.

అయితే ఇంత‌లోనే ఇంకో వైర‌స్ దేశంలో వెలుగుచూసింద‌నే వార్త‌లు అందరిలో క‌ల‌వ‌రాన్ని క‌లిగిస్తున్నాయి. కేరళలో టొమాటో ఫ్లూ, ఆంత్రాక్స్ తర్వాత.. ఇప్పుడు సిక్కింలో నైరోబి ఫ్లై వ్యాప్తి పెరుగుతోందనే వార్త‌లు అంద‌రిలో ఆందోళ‌న పెంచుతున్నాయి.

తాజాగా సిక్కింలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో నైరోబీ ఫ్లై ఇన్ఫెక్షన్ కేసు తెరపైకి రావడంతో కలకలం రేగింది. ఈ నైరోబి ఫ్లై వైరస్ కేసులు ఎక్కువగా తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కెన్యాలో ఇవి ఎక్కువ‌ని.. అందుకే ఆ దేశ రాజ‌ధాని నైరోబీ పేరు మీదుగా దీనికి నైరోబీ ఫై అని పేరు పెట్టార‌ని అంటున్నారు.

ఇవి చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగిస్తాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు రావడంతోపాటు ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారుతుందని అంటున్నారు.

నైరోబీ ఫ్లై ని కెన్యాన్ ఫ్లై లేదా డ్రాగన్ ఫ్లై అని కూడా అంటార‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది రొయ్యల ఆకారంలో ఉంటుంద‌ని వివ‌రిస్తున్నారు. ఈ వైర‌స్ నారింజ, నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయ‌ని అంటున్నారు.

నైరోబీ ఈగ‌లు ఎక్కువ వర్షాలు ఉన్న ప్రాంతంలో సంచరిస్తాయ‌ని పేర్కొంటున్నారు. ఉత్తరాదిలో హిమాలయాల దిగువన వర్షపాతం అధికంగా ఉండడంతో అవి అక్కడ సంచ‌రిస్తున్నాయ‌ని వివ‌రిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఇవి సిక్కింలో కనిపిస్తున్నాయ‌ని అంటున్నారు.

ఈ నైరోబీ ఈగ‌లు మాన‌వుల‌ చర్మంపై వాలిన తర్వాత ఒక ప్రత్యేక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయ‌ని చెబుతున్నారు. ఈ రసాయనం పేరు పెడెరిన్ అని.. ఇది చర్మంపై పడిన వెంటనే మంట పుడుతున్న అనుభూతి వస్తుంద‌ని అంటున్నారు. ఆ త‌ర్వాత చ‌ర్మంగా ఎర్ర‌గా మారి ద‌ద్దుర్లు వ‌స్తాయ‌ని వివ‌రిస్తున్నారు. 48 గంటల తర్వాత, చర్మంపై బొబ్బలు, దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయ‌ని పేర్కొంటున్నారు. ఈగ ఎక్కువ ర‌సాయ‌నాన్ని మ‌నిషిపై చిమ్మితే ప్రాణానికి కూడా ప్ర‌మాద‌మంటున్నారు.