మరో భయంకరమైన వైరస్ వస్తోంది.. టైమ్ ట్రావెలర్ వార్నింగ్

Fri Jul 01 2022 06:00:01 GMT+0530 (IST)

Another terrible virus is coming Time traveler warning

టైం ట్రావెలింగ్ అంటే తెలుసుగా.. అదేనండి ఆదిత్య 369 సినిమాలో వర్తమానం నుంచి భూత కాలానికి భవిష్యత్ కు వెళ్తారు. అలా వెళ్లే వారిని టైం ట్రావెలర్స్ అంటారు. నిజజీవితంలో వీళ్లు ఉంటారో లేదోనన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ అప్పుడప్పుడు తమని తాము టైం ట్రావెలర్స్ గా చెప్పుకుంటూ భవిష్యత్ లో ఇలా జరగబోతోంది.. అలా జరగబోతోందని జనాల్ని భయపెట్టే వారు కొందరున్నారు. వాటిని నమ్మి కొందరు భయానికి గురైతే.. మరికొందరు తేలికగా కొట్టిపారేస్తూ ఉంటారు.ఇంతకీ ఇప్పుడు టైం ట్రావెలర్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. ఇటీవల ఓ వ్యక్తి తాను 2096 నుంచి వచ్చానని.. మరో రెండేళ్లలో కరోనాను మించిన విచిత్రమైన ప్రమాదకరమైన వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోందని చెప్పాడు. తన టిక్ టాక్ అకౌంట్ లో దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు. తన అకౌంట్ లో ఇలా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వీడియోలు చాలా ఉన్నాయి.

ఈ యూజర్ @timetravlehqr పేరుతో ఉన్న టిక్ టాక్ అకౌంట్ లో ఈ టైం ట్రావెలర్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఈ భయంకరమైన వైరస్ పుడుతుంది అన్నాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. కొందరేమో ఇదంతా నిజమని నమ్మి భయానికి గురవుతుంటే.. మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.

ఇంకొందరేమో.. అతడు టైమ్ ట్రావెలరే అయితే అతనికి ప్రపంచాన్ని కాపాడే ఉద్దేశమే ఉంటే.. అతను రావాల్సింది 2022కి కాదు. కరోనాకి ముందు అని అంటున్నారు. అలా ముందే వచ్చి ప్రపంచాన్ని అప్రమత్తం చేసి ఉంటే లక్షల ప్రాణాలు పోయేవి కావని భావిస్తున్నారు. అతని టైం ట్రావెలర్ కాదు కాబట్టే అలా చేయలేక పోయాడని.. ఇదంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు.

అయితే ఇతను చెప్పిన విషయాలు కాస్త వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని మరికొందరు భావిస్తున్నారు. ఈ ఏడాది మే 17న అమెరికా చట్టసభ సభ్యులు ఎగిరేపళ్లాల గురించి చర్చించారు. మరోవైపు 2014లో మిడిల్ ఈస్ట్‌లో తమకు UFOలు కనిపించాయని అమెరికా ఆర్మీ ప్రముఖులు చెప్పడం వల్ల ఈ చర్చ జరిగింది.

ఈజిప్ట్ సరిహద్దులోని సినాయ్ ఎడారి అవుట్ పోస్ట్ దగ్గర.. 8 కాంతివంతమైన ఎగిరేపళ్లాలు.. అత్యంత వేగంగా ఆకాశంలో వెళ్లినట్లు ఆర్మీ ప్రముఖులు తెలిపారు. వాళ్లే కాదు.. అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా (NASA) కూడా దీనిపై ఓ ప్రకటన చేసింది. UFOలపై అధ్యయనానికి ఓ ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన జారీ చేసింది.

ఇక వైరస్ ల దాడి కూడా కామన్ అయిపోయింది. రోజుకో వైరస్ పుట్టుకొస్తూ జనాల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. జలుబు ఫ్లూ స్వైన్ ఫ్లూ చికెన్ పాక్స్ మంకీ పాక్స్ కరోనా ఒమిక్రాన్ డెల్టా నిఫా వైరస్ ఇలా రోజుకో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది కాబట్టి.. మరికొన్ని ఏళ్లలో ఇంకో రకమైన వైరస్ దాడి చేస్తుంది అనడంలో వింతేం లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.