కరోనా కుట్రలో మరో షాకింగ్ ఎపిసోడ్.. వైరస్ ప్రకటనకు ముందే టీకా రెఢీ?

Wed Jun 09 2021 08:00:18 GMT+0530 (IST)

Another shocking episode in the Corona

కరోనా మహమ్మారి మొత్తం కుట్రేనా? చైనా దర్మార్గానికి ప్రపంచం భారీ మూల్యం చెల్లించిందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏడాది క్రితం ఈ వాదన అనుమానంగా మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ ఆస్ట్రేలియాకు చెందిన మీడియా సంస్థ కరోనా కుట్రకు సంబంధించిన సంచలన అంశాల్ని పేర్కొంది.తాను వినిపిస్తున్న వాదనకు ఆధారంగా చైనాలో చోటు చేసుకున్న రెండు ఉదంతాల్నిప్రస్తావించింది. అందులో మొదటిది.. కరోనా మహమ్మారి గురించి చైనా ప్రపంచానికి వెల్లడించిన మూడు నెలల వ్యవధిలోనే చైనాలో పని చేసిన యూసెన్ జువూ కొవిడ్ 19 వ్యాక్సిన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 మార్చి 11న ప్రకటిస్తే.. అంతకు ముందే కొవిడ్ వ్యాక్సన్ పై పేటెంట్ కావాలంటూ యూసెన్ అప్లికేషన్ పెట్టుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

మరింత లోతుల్లోకి వెళితే.. కరోనా వైరస్ మనుషులకు సోకినట్లుగా చైనా ప్రకటించిన ఐదు వారాలకే వ్యాక్సిన్ పేటెంట్ కోసం యుసెన్ సన్నాహాలు చేయటాన్ని చూస్తే.. వైరస్ ప్రకటనకు ముందే వ్యాక్సిన్ సిద్ధమైందన్న అభిప్రాయం కలుగక మానదు. మరో కీలక అంశం ఏమంటే..కొవిడ్ 19 వ్యాక్సిన్ పేటెంట్  కోసం అప్లై చేసుకున్న మూడునెలల వ్యవధిలోనే అతగాడు అనుమానాస్పద రీతిలో మరణించటం గమనార్హం. అతడి మరణ వార్తను చైనాలోని ఒక్క మీడియా సంస్థ మాత్రమేరిపోర్టు చేయటం మరిన్ని అనుమానాలకు గురి చేస్తోంది. దేశీయంగా ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు మరణిస్తే.. ఒక్క మీడియా సంస్థలోనే వార్తగా ఎందుకు వచ్చినట్లు? అన్నప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన సుప్రసిద్ధ మీడియా సంస్థ న్యూయార్కు టైమ్స్ వెల్లడించటం విశేషం.

అనుమానాస్పద రీతిలో మరణించిన చైనా శాస్త్రవేత్త యుసెన్.. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ.. న్యూయార్క్ బ్లడ్ సెంటర్ లో కూడా శాస్త్రవేత్తగా పని చేశారని చెబుతున్నారు. వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ కావటంతోనే కొవిడ్ 19 విజృంభించిందని ఏడాది క్రితమే అమెరికా నేషనల్ ల్యాబరేటరీ తన నివేదికలో పేర్కొన్నట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. చూస్తుంటే.. వూహాన్ కుట్ర కోణానికి సంబంధించి వెలుగు చూస్తున్న అంశాలు.. మహమ్మారి మనిషి తయారు చేసిందే అన్న భావనను బలపడేలా చేస్తుందని చెప్పక తప్పదు.