Begin typing your search above and press return to search.

మిరాకిల్ః త‌ల్లి క‌డుపులో ఉన్న బిడ్డ గ‌ర్భంలో మ‌రో శిశువు!

By:  Tupaki Desk   |   1 Aug 2021 5:34 AM GMT
మిరాకిల్ః  త‌ల్లి క‌డుపులో ఉన్న బిడ్డ గ‌ర్భంలో మ‌రో శిశువు!
X
ఇది వైద్య శాస్త్రంలోనే అద్భుతం అని సినిమాల్లో త‌ర‌చూ ఓ డైలాగ్ వింటుంటాం. అలాంటి ప‌దాన్ని నిజ జీవితంలో డాక్ట‌ర్లు వాడేశారు! ఈ విష‌యం మొత్తం తెలుసుకుంటే మ‌నం కూడా ఆ డైలాగ్ ను రిపీట్ చేయాల్సిందే. మ‌హిళ గ‌ర్భ‌వ‌తి కావ‌డం సాధార‌ణ విష‌యం. బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం కూడా మామూలే. కానీ.. పుట్టిన బిడ్డ క‌డుపులో మ‌రో శిశువు ఉంటే..? అదెలా సాధ్యం అంటున్నారా! అదే మెడిక‌ల్ మిరాకిల్‌. మ‌రి, అది ఎలా సాధ్య‌మైంది? ఎక్క‌డ‌? అన్న వివ‌రాలు చూద్దాం.

మ‌హిళ గ‌ర్భం దాల్చ‌గానే ప్ర‌తీ మూడు నెల‌లకు ఒక‌సారి ఆసుప‌త్రికి వెళ్ల‌డం.. స్కానింగ్ తీయించుకోవ‌డం అనేది అంత‌టా జ‌రిగిదే. త‌ద్వారా.. బిడ్డ ఎదుగుద‌ల తెలుసుకోవ‌డంతోపాటు ఏదైనా స‌మ‌స్య ఉంటే వెంట‌నే గుర్తించి ప‌రిష్క‌రిస్తుంటారు వైద్యులు. ఇదే విధంగా ఇజ్రాయిల్ లోని ఓ మ‌హిళ కూడా ఆసుప‌త్రికి వెళ్లింది. అంతా బాగానే ఉందిగానీ.. క‌డుపులో ఉన్న బిడ్డ పొట్ట‌భాగం కాస్త ఎత్తుగా క‌నిపించింది. కానీ.. కార‌ణం ఏంట‌న్న‌ది పూర్తిగా గుర్తించ‌లేక‌పోయారు. డెలివ‌రీ అయ్యాక చూడాల‌ని డిసైడ్ అయ్యారు.

ఆ సంద‌ర్భం రానేవ‌చ్చింది. డెలివ‌రీ నాటికి ఆ బిడ్డ క‌డుపు మ‌రికాస్త ఎత్తుగా క‌నిపించింది. ప్ర‌స‌వం పూర్త‌య్యాక ఆ బేబీ ఆడ‌బిడ్డ అని తేలింది. మ‌రి, ఆమె పొట్ట భాగం ఎత్తుగా ఉండ‌డానికి కార‌ణ‌మేంటీ? అని మ‌ళ్లీ ఆ బేబీకి స్కాన్ చేశారు. ఆ రిపోర్టు చూసిన వైద్యుల‌కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ ప‌సిగుడ్డు క‌డుపులో మ‌రో పిండం ఉంది. ఒక్క‌టి కాదు.. రెండు ఉన్నాయి!

ఇది చూసిన వైద్యులు ఆశ్చ‌ర్యానికి, ఆందోళ‌న‌కు లోన‌య్యారు. దీంతో.. ఆప‌రేష‌న్ చేసి, ఆ రెండు పిండాల‌ను తొల‌గించారు. ప్ర‌స్తుతానికి స‌మ‌స్య ఏమీ లేద‌ని, అబ్జ‌ర్వేష‌న్లో ఉంచామ‌ని చెప్పారు. అయితే.. ఇలాంటి కేసులు దాదాపు 5 ల‌క్ష‌ల మందికి ఒక‌రిలో క‌నిపిస్తాయ‌ని చెప్పారు. క‌వ‌ల పిండాలు ఏర్ప‌డిన‌ప్పుడు ఒక‌దానిలోకి మ‌రొక‌టి వెళ్లిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని, ఈ కేసులో కూడా అలాగే జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు.