Begin typing your search above and press return to search.

గంగూలీ ఖాతాలో చేరబోతున్న మరో ఘనత ..ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   4 Dec 2019 2:33 PM GMT
గంగూలీ ఖాతాలో చేరబోతున్న మరో ఘనత ..ఏమిటంటే ?
X
బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ టీం ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత క్రికెట్‌లో చాలా త్వరితగతిన అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. డే నైట్ టెస్టు ఊహించిన దానికంటే విజయవంతం కావడంతో రాబోయే రోజుల్లో ప్రతి సిరిస్‌లోనూ టీమిండియా ఓ డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడాలని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

తాజాగా, భారత క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ మరో అడుగు ముందుకేసే నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్‌ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించేందుకు గంగూలీ సిద్ధమయ్యాడు.
ఈ స్టేడియంలో తొలి మ్యాచ్‌ని నిర్వహించేందుకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వరల్డ్ ఎలెవన్ vs ఇండియా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కి ఈ స్టేడియం ఆతిధ్యం ఇవ్వబోతుంది.

ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ అంటే ఆస్ట్రేలియాలో ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ అని అందరూ చెప్తారు. కానీ , ఇప్పుడా ఆ ఎంసీజీని తలదన్నే స్టేడియంలో ఇండియాలోని అహ్మదాబాద్‌ లో నిర్మిస్తున్నారు. మొతెరాలో ఉన్న స్టేడియాన్ని తొల‌గించి, అదే స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి 700 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు. ప్ర‌స్తుతం స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చును గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ భ‌రిస్తోంది. మొతెరా స్టేడియం అందుబాటులోకి వ‌స్తే.. మెల్‌బోర్న్ రికార్డును అధిగమించడం ఖాయం.

ఈ స్టేడియంలో మొత్తం నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు, మూడు ప్రాక్టీస్ గ్రౌండ్‌లు ఉంటాయి. ట్రైనింగ్ సెంటర్‌తో పాటు 50 గదులతో క్లబ్ హౌస్ ఉంటుంది. 76 కార్పోరేట్ బాక్సులు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండబోతున్నాయి. అన్ని సదుపాయాలతో ప్రపంచం మొత్తం ఆకర్షించే విధంగా ఈ స్టేడియం నిర్మాణం అవుతుంది. ఈ స్టేడియం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తైంది. జనవరి 2020 కల్లా స్టేడియంలో అందుబాటులోకి రానున్నట్లు గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వాని తెలిపారు.