రాజ్ కుంద్రా కేసులో మరో ట్విస్ట్

Thu Oct 28 2021 12:36:49 GMT+0530 (IST)

Another Twist In The Raj Kundra Case

రాజ్ కుంద్రాపై బాలీవుడ్ శృంగార తార షెర్లిన్ చోప్రా మరో బాంబు పేల్చింది.నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తనను లైంగికంగా.. మానసికంగా వేధిస్తున్నాంటూ గత ఏప్రిల్ లోనే పోలీసులకు షెర్లిన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే షెర్లిన్ తమపై చేసిన ఆరోపణలు అవాస్తవమని కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు మాత్రమే ఆమె అలా చేసిందని.. షెర్లిన్ ఆరోపణలు నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి దంపుతుల తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా షెర్లిన్ చోప్రాపై ఏకంగా రూ.50 కోట్లకు పరువునష్టం దావా వేశారు. దీంతో ఈ విషయంపై తాజాగా నటి షెర్లిన్ చోప్రా ఎట్టకేలకు స్పందించింది.రాజ్ కుంద్రా దంపతులు తనను గ్యాంగ్ స్టర్ లతో బెదిరింపులకు గురిచేశారని షెర్లిన్ ఆరోపించింది. ఇప్పుడు పరువు నష్టం నోటీసులు కూడా ఇచ్చారని.. కానీ ఇలాంటివాటికి భయపడేది లేదని తేల్చిచెప్పింది.

ఇక తనను మానసికంగా వేధించినందుకు గాను రూ.75 కోట్లు అడుగుతూ తానే తిరిగి వాళ్లకు నోటీసులు పంపానని నటి షెర్లిన్ తెలిపింది. గతంలో రాజ్ కుంద్రాపై చేసిన ఫిర్యాదుపై విచారణకు తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నట్టు షెర్లిన్ తెలిపారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.