Begin typing your search above and press return to search.

సర్కారు తీరు పై మనస్తాపం.. మరో ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్

By:  Tupaki Desk   |   13 Nov 2019 4:56 AM GMT
సర్కారు తీరు పై మనస్తాపం.. మరో ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్
X
ఆరో వారం లో అడుగు పెట్టిన ఆర్టీసీ సమ్మె లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ చరిత్ర లో ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని రీతిలో ఇంత సుదీర్ఘంగా సమ్మె జరిగింది లేదు. తెలంగాణ సాధన కోసం జరిగిన సకల జనుల సమ్మె వేళ ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘ కాలం సమ్మె నిర్వహించారు. తాజాగా జరుగుతున్న సమ్మె ఆ రికార్డు ను కూడా బ్రేక్ చేసే దిశ గా సాగుతోంది.

ప్రభుత్వం తన నిర్ణయం మీద నుంచి వెనక్కి తగ్గక పోవటం.. కోర్టు సైతం ఏం చేయాలన్న దాని పైనా కిందా మీదా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సమ్మెను చట్ట విరుద్దం కాదని ప్రకటించిన హై కోర్టు.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పైన ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేలా ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఉత్కంఠ గా మారింది. ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికులు మాత్రం తెలంగాణ సర్కారు తీరు మీద తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు.

తాము చేస్తున్న సమ్మె వేళ.. నిరాశ కు గురైన కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం..కొందరు ఆత్మ బలిదానాలు చేయటం తెలిసిందే. తాజా గా అలాంటి పనే చేశారు మహబూబాబాద్ డిపోకు చెందిన నరేశ్ అనే డ్రైవర్. ఈ రోజు తెల్ల వారుజామున (బుధవారం) పురుగుల మందు తాగి ఆత్మ హత్యయత్నం చేశాడు. అతడు పురుగుల మందు తాగిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానికం గా ఉన్న ఆసుపత్రి కి తీసుకెళ్లారు. అతని కి వైద్యులు చికిత్స చేస్తుండ గానే మరణించాడు. తాజా ఆత్మ హత్య తెలంగాణ ఆర్టీసీ సమ్మెను మరింత రగిలేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.