అంతరిక్షయానంకి మరో భారత యువతి .. జెఫ్ బెజోస్ టీంతో కలిసి ఆకాశంలోకి !

Tue Jul 20 2021 14:05:14 GMT+0530 (IST)

Another Indian girl Sanjal Gavande Marathi for space

గత కొద్ది రోజుల కిందటే తెలుగమ్మాయి శిరీష బండ్ల అంతరిక్షయానంకి వెళ్లొచ్చారు. వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ టీమ్ తో కలిసి భూవాతావరణాన్ని దాటి అంతరిక్షం లోకి వెళ్లి వచ్చారు. అయితే ఆ అద్భుతం చోటు చేసుకున్న సరిగ్గా తొమ్మిదో రోజు మరో భారతీయురాలు అంతరిక్షానికి దూసుకెళ్లనున్నారు. ప్రపంచ అపర కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ తో కలిసి ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. ఈ సారి మరాఠీ యువతి సంజల్ గవాండే ఈ ఘనతను సాధించనున్నారు.ఇంతకీ ఎవరీ సంజల్ మహారాష్ట్ర నుంచి బ్లూ ఆరిజిన్ వరకు ఎలా వెళ్లారు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం...ఈ నెల 20వ తేదీన తన బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా బెజోస్ అంతరిక్ష యానం చేయనున్నారు. తనతో పాటు మరో ముగ్గురిని రోదసిలో తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం న్యూ షెపర్డ్ వ్యోమనౌకను సంస్థ అభివృద్ధి చేసింది. ఈ బృందంలో సంజల్ గవాండే కూడా సభ్యురాలు. బ్లూ ఆరిజిన్లో సిస్టమ్ ఇంజినీర్గా పనిచేస్తున్న సంజల్ న్యూ షెపర్డ్ తయారీలో కీలక పాత్ర పోషించారు. సంజల్ గవాండే స్వస్థలం ముంబై. ముంబై శివార్లలోని కల్యాణ్ సమీపంలో గల కోల్సెవాడిలో జన్మించారామె. తండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. ముంబై యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. మిచిగాన్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఏర్పడటంతో ఏరోస్పేస్ టెక్నాలజీపై పట్టు సాధించారు. అనంతరం విస్కన్సిస్ లోని మెర్క్యూరీ మెరైన్ సంస్థలో చేరారు. అనంతరం కాలిఫోర్నియాలోని టొయోటా రేసింగ్ డెవలప్ మెంట్ లో ఉద్యోగం సంపాదించారు. 2016లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. అదే సమయంలో నాసాలో ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు గానీ ఎంపిక కాలేకపోయారు. పౌరసత్వ సమస్యలు ఏర్పడటంతో సంజల్ గవాండే దరఖాస్తును నాసా తిరస్కరించింది. అదే సమయంలో జెఫ్ బెజోస్ నెలకొల్పిన బ్లూ ఆరిజిన్ సంస్థలో సిస్టమ్ ఇంజినీర్గా చేరారు. తాజాగా జెఫ్ బెజోస్ స్పేస్ టూర్లో భాగస్వామి అయ్యారు. అంతరిక్ష ప్రయాణానికి జెఫ్ బెజోస్ వినియోగించే న్యూషెపర్డ్ రాకెట్ అభివృద్ధి చేయడంలో సంజల్ కీలకపాత్ర పోషించారు.

ఈ మధ్యలోనే కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా పౌరసత్వ సమస్యలతో ఎంపిక కాలేదు. ఆ తర్వాత బ్లూ ఆరిజన్లో సిస్టమ్ ఇంజినీర్ గా చేరారు. తాజాగా బెజోస్ అంతరిక్షయానంలో భాగస్వామి అవడమేగాక న్యూ షెపర్డ్ వ్యోమనౌక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. జెఫ్ బెజోస్ తో పాటు ఆయన సోదరుడు మార్క్ ఆలిమన్ డేమర్ వాలీ హంక్ సంజల్ గవాండేలతో కూడిన టీమ్ న్యూ షెపర్డ్ స్పేస్ రాకెట్లో అంతరిక్ష ప్రయాణం చేయబోతోన్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 8 గంటలకు స్పేస్ జర్నీ ప్రారంభం కానుంది. టెక్సాస్ పశ్చిమ ప్రాంతంలోని వాన్ హార్న్ అనే టౌన్ లో గల స్పేస్ సెంటర్ నుంచి వారి ప్రయాణం మొదలవుతుంది. 11 నిమిషాల పాటు వారు అంతరిక్షంలో విహరిస్తారు. భార రహిత స్థితిలో ఉంటారు.

ఈ పూర్తి స్వయంచాలిత ఫ్లైట్ లో.. బెజోస్ తో పాటు ప్రముఖ మహిళా పైలట్ వేలీ ఫంక్ వెళ్లనున్నారు. ఆమెకు 82 ఏళ్లు. దీనితో ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. వీరితో పాటు ప్రయాణించనున్న 18ఏళ్ల ఆలివర్ డేమన్ అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నారు. ఈ రోదసి వీరుల బృందం భూ వాతావరణానికి రోదసికి సరిహద్దు అయిన కర్మాన్ రేఖ ఆవల భూమి నుంచి 100కిలోమీటర్ల ఎత్తులో 11 నిమిషాలు గడుపనున్నారు.ఈ వ్యోమనౌక 65 మైళ్ల (106కి.మీలు) ఎత్తువరకు వెళ్లగలదు. రోదసికి చేరుకున్నాక అక్కడి నుంచి భూమిని విశ్వాన్ని క్యాబిన్ నుంచి వీక్షించనుంది బెజోస్ బృందం. ఆ తర్వాత క్యాప్సుల్ తిరిగి భూమికి చేరుకుంటుంది. పెద్ద ప్యారచూట్ల సాయంతో యాత్రికులు కిందకి దిగుతారు.

బెజోస్ బృందం ప్రయాణిస్తున్న క్యాప్సుల్కు పెద్ద విండోలు ఉండటం విశేషం. ఇంత భారీ విండోలతో అంతరిక్షాన్ని చూసే అవకాశం దక్కినందుకు గర్వపడుతున్నామని బెజోస్ బృందం వెల్లడించింది. ఇటీవలే రోదసి యాత్ర పూర్తి చేసిన బ్రిటన్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ బృందం వెళ్లిన క్యాప్సుల్కు ఎరోప్లేన్ సైజ్ విండోలు మాత్రమే ఉన్నాయి.న్యూషెపర్డ్ వ్యోమనౌకకు ఎస్కేప్ సిస్టమ్ ఉంది. ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే యాత్రికులు ఉన్న క్యాప్సుల్ వ్యోమనౌక నుంచి విడిపోతుంది.2012 నుంచి న్యూషెపర్డ్ వ్యోమనౌకను 15 సార్లు విజయవంతంగా ప్రయోగించింది బ్లూ ఆరిజన్. అయితే మానవసహిత ప్రయోగం మాత్రం ఇదే తొలిసారి.'న్యూ షెపర్డ్' అభివృద్ధిలో మరాఠా అమ్మాయి సంజల్ గవాండే కీలక పాత్ర పోషించడం విశేషం.