ఎన్నాళ్లకెన్నాళ్లకు కశ్మీర్ లో సినిమా థియేటర్ ఓపెనింగ్

Sun Aug 14 2022 21:30:40 GMT+0530 (IST)

Another Attraction Kashmir Valley To Welcome Multiplex

కశ్మీర్.. చెప్పడానికి భారత దేశంలోనే ఉన్నా ఆర్టికల్ 370 సహా సవాలక్ష నిబంధనలతో అక్కడ అభివృద్ధి లేక.. ఇతరులు ప్రవేశించలేక ఎంటర్ టైన్ మెంట్ కు జనాలు దూరమయ్యారు. ఎప్పుడూ ఉగ్రవాదం.. పేదరికంతో అల్లాడిన కశ్మీర్ కు నిజంగానే మోడీ విముక్తి కల్పించి ఇప్పుడక్కడ అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నారు.90వ దశకంలో కశ్మీర్ లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులతో అక్కడ ప్రజలకు సినిమాలు సినిమా థియేటర్లు దూరమయ్యాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలతో జనం సినిమా థియేటర్లకు రాలేదు. ఓనర్లు థియేటర్లు మూసేశారు.

మోడీ సర్కార్ చర్యలతో ఇప్పుడక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కశ్మీరీ ప్రజలకు సినిమా వినోదం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఐనాక్స్ సంస్థ శ్రీనగర్ లో మల్టీపెక్స్ నిర్మిస్తోంది. ఇది వచ్చే నెలలో ప్రారంభం అవుతోంది.

ఈ మల్టీప్లెక్స్ లో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్.. సౌకర్యవంతమైన సీటింగ్ తో ఈ థియేటర్ ను తీర్చిదిద్దుతున్నారు.  దాదాపు 520 సీట్లు గల ఇందులో ఫుడ్ కోర్టులు చిన్నారులు ఆడేందుకు టాయ్ మెషీన్లు సహా సకల ఏర్పాట్లు ఉన్నాయి.

ఇలా ఉగ్రవాద భూతంతో సతమతమైన కశ్మీరీలకు ఎంటర్ టైన్ మెంట్ ను పంచేందుకు ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. మోడీ సర్కార్ చర్యలు.. అభివృద్ధిపై అక్కడి జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.