Begin typing your search above and press return to search.

WHO వార్నింగ్.. కోవిడ్ తో మరో 7 లక్షల మరణాలు!

By:  Tupaki Desk   |   24 Nov 2021 9:30 AM GMT
WHO వార్నింగ్.. కోవిడ్ తో మరో 7 లక్షల మరణాలు!
X
కరోనా.. ఈ పేరు వినగానే ప్రపంచదేశాలు సైతం ఉలిక్కిపడుతున్నాయి. చిన్నదేశం.. అగ్రరాజ్యం తేడా లేకుండా ఏడాదిన్నర కాలంగా కోరలు చాస్తోంది. మహమ్మారి ధాటికి ఎంతో ప్రాణాలు కోల్పోయారు. దశలవారీగా విజృంభిస్తూ ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. ఇక భారతదేశంలో రెండో దశలో విశ్వరూపం చూపించింది.

ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. వైరస్ ప్రభావం కాస్త తక్కువగానే ఉందని చెప్పవచ్చు. అయితే యూరప్ వంటి దేశాలను ఇంకా వణికిస్తూనే ఉంది.

యూరప్ లోని కరోనా కేసులపై డబ్లూహెచ్వో సమీక్షించింది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని యూరప్ పరిధిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం తెలిపింది. వచ్చేఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల మంది మహమ్మాది ధాటికి బలవుతారని హెచ్చరించింది.

యూరప్ లోని 53 దేశాల్లో మొత్తం ఇప్పటివరకు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. 2022నాటికి దాదాపు 49 దేశాల్లోని ఐసీయూల అవసరం పెరుగుతుందని అంచనా వేసింది.

కొవిడ్ వల్ల రోజూవారీ మరణాల సంఖ్య ఇటీవల రెట్టింపు అయిందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. రష్యాలో ఈ సంఖ్య 1200 దాటిందని వెల్లడించింది. అయితే ఇంకా చాలామంది టీకా తీసుకోకుండా ఉండడం, డెల్టా వేరియంట్ ప్రభావం వల్ల పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించింది. వ్యాక్సినేషన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చెప్పింది.

ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి ప్రతీఒక్కరూ కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ హూన్స్ క్లూగే తెలిపారు. ఈ శీతాకాలంలో మరింత నష్టం జరగకుండా ఉండేందుకు అందరూ సహకరించాలని సూచించారు. ప్రతీఒక్కరూ మాస్క్ ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని అన్నారు. టీకా తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి పెరుగుతుండడం వల్ల ఆస్ట్రియా మరోసారి లాక్ డౌన్ విధించింది. మరికొన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా యోచిస్తున్నాయి. నెదర్లాండ్స్ లో పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే వీటిపై ప్రజల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల జనం వ్యతిరేకత కనబర్చుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్ వంటి దేశాలు వంద శాతం వ్యక్సినేషన్ పూర్తి చేసే పనిలో పడ్డాయి. త్వరలో బూస్టర్ డోసును కూడా వంద శాతం పూర్తి చేయనున్నాయి. ప్రస్తుతం బూస్టర్ డోసు తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి.