Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రియాల్టీ : జ‌గ‌న్ స్పీడ్ త‌గ్గింది..బాబు గ్రాఫ్ పెరిగింది.. ఎనీ డౌట్స్ !

By:  Tupaki Desk   |   17 May 2022 2:38 AM GMT
గ్రౌండ్ రియాల్టీ :  జ‌గ‌న్ స్పీడ్ త‌గ్గింది..బాబు గ్రాఫ్ పెరిగింది.. ఎనీ డౌట్స్ !
X
ఆంధ్రావ‌ని రాజ‌కీయాల్లో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి అనేందుకు తార్కాణం ప్ర‌స్తుతం నెల‌కొన్న వాగ్యుద్ధాలే ! ఒక‌రిపై ఒక‌రు దూషించుకోవ‌డం అన్న‌ది అటుంచితే అప్ప‌టి క‌న్నా ఇప్పుడు తిట్ల‌తో ఇమేజ్ పెరిగిపోతుంది కొంద‌రికి ! తిట్ట‌డం ఓ హ‌క్కు అయి పోయింది ఇంకొంద‌రికి.. ఆ విధంగా రాష్ట్ర రాజకీయంలో రాజీ లేని మార్పులు వ‌స్తున్నాయి. జ‌గన్ ఇవాళ కాస్త వెన‌క్కు త‌గ్గారా అన్న అనుమానాలూ వ‌స్తున్నాయి.

ఆయ‌నకు ఎన్నిసార్లు చెప్పినా ప్ర‌భుత్వ వేదిక‌ల‌పై విప‌క్షాల‌ను విమ‌ర్శించ‌డం మాత్రం మానుకోవ‌డం లేదు అని సొంత పార్టీ అభిమానులే ఆవేద‌న చెందుతున్నారు. ఓ విధంగా మీడియాను ఆయ‌న టార్గెట్ చేస్తున్న వైనం, దుష్ట చ‌తుష్ట‌యం అంటూ ఓప‌దం ప‌దే ప‌దే వాడుతున్న వైనం కొంత ఇబ్బందిగానే ఉంది ఇవాళ విప‌క్షానికి.. !ఇదే స‌మ‌యంలో సాక్షి అనే ఓ సొంత మీడియా జ‌గ‌న్ కూ ఉంద‌ని గుర్తు పెట్టుకోవాలి ఆ విష‌యం అని .. విప‌క్షం హిత‌వు చెబుతోంది. కానీ అది శృతిమించడంతో బూమరాంగ్ అవుతోంది.

ఆ రోజు ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ కొంత అస‌హ‌నం వెల్ల‌డి చేశారు అప్ప‌టి సీఎం వైఎస్. ఇప్పుడు రెండు కాస్త నాలుగు అయ్యాయి.అంటే కొన్ని ప‌త్రిక‌ల‌పై పెద్దాయ‌న‌కు ఉన్న అస‌హ‌న‌మే ఇప్పుడు జ‌గ‌న్-కూ ఉంది. ఎంత కోపం ఉన్నా స‌రే ! ప‌త్రిక‌ను స్థాపించాక చాలా సంద‌ర్భాల్లో ఈనాడునే రిఫ‌రెన్స్ కోడ్ గా తీసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. క‌నుక జ‌గన్ కాస్త వెన‌క్కు త‌గ్గి మీడియాను తిట్ట‌డం మానుకోవాలి అని కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సోష‌ల్ మీడియా వేదిక‌గా హిత‌వు చెబుతున్నారు.

మీడియాను తిట్టడం క‌న్నా గ్రౌండ్ లెవ‌ల్ రియాల్టీ ఆయ‌న అర్థం చేసుకోవాల‌ని ప‌దే ప‌దే అంటున్నారు. నిన్నటికి నిన్న జరిగిన సభ చూస్తే పత్రికలను చంద్రబాబును తిడుతుంటే జనం అసహనం ఫీలవుతున్నారు. చివరకు సీఎం సభ నుంచే సీఎం మాట్లాడుతుండగానే బయటకు వెళ్లిపోయారు. మరోవైపు చంద్రబాబు సభలకు జనం రావడం పెరుగుతోంది, జనం కేరింతలు వేయడమూ పెరుగుతోంది. ఇటీవలే ఇది కనిపిస్తోంది.

అంటే బాబు గ్రాఫ్ కూడా బాగానే పెరుగుతోంది. అధినేతగా ఆయ‌న మంచి మార్కులు ద‌క్కించుకుంటున్నారు. ముఖ్యంగా ఒంట‌రి పోరు కొన్ని సంద‌ర్భాల్లో చేయాల్సి ఉన్నా కూడా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఆ విధంగా బాబు కాస్తో కూస్తో త‌న వ‌య‌స్సును మ‌రిచి శ్ర‌మిస్తూ ఉన్నారు.

ఆ పాటి శ్ర‌మను లోకేశ్ కానీ ఇత‌రులు కానీ అర్థం చేసుకుని ప‌నిచేస్తే మేలు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు,రాకుండాపోయిన ప్రాజెక్టులు వీటిపై కూడా మాట్లాడి, గ‌ణాత్మ‌క స‌హితంగా వివ‌రాలు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ అప్ప‌టి క‌న్నా ఇప్పుడు బాబు గ్రాఫ్ బాగుంది. జ‌గ‌న్ అస‌హ‌నం పెరిగిపోయింది..అన్న‌దే విశ్లేష‌కుల వివ‌రం.