ఇక ఒకే నంబర్.. తెలుగురాష్ట్రాల్లో అమల్లోకి

Mon Apr 22 2019 16:09:22 GMT+0530 (IST)

Andhra and Telangana Join Pan India Single Emergency Helpline Number 112

దేశవ్యాప్తంగా అత్యవసర సేవల కోసం ఇప్పటికే కేంద్రం 112 నంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలు - అగ్ని ప్రమాదాలు - గాయపడ్డ వారి కోసం - వైద్య సేవల కోసం ఇన్నాళ్లు 108 - 102  -100 - 104లకు డయల్ చేసేవాళ్లం.. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వేరే వేరే నంబర్లున్నాయి. ఇప్పుడు వీటి స్థానాల్లో ఒకే నంబర్ అందుబాటులోకి వచ్చింది.కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘112’ హెల్ప్ లైన్ నంబర్ ను పాన్ ఇండియాగా వర్తింప చేసింది. ఇక అన్ని ఎమెర్జీన్సీ సేవలకు ఇదే నంబర్ ను ఉపయోగించాలని ఆదేశించింది. తాజాగా 112 నంబర్ ను తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 20 రాష్ట్రాలు ఈ సేవల పరిధిలోకి వస్తాయి. 

112 సేవలు 24గంటల పాటు అందుబాటులో ఉంటాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు.  ఏదైనా స్మార్ట్ పోన్ - ఫీచర్ - ల్యాండ్ ఫోన్ నుంచి అయినా 112కు ఫోన్ చేస్తే అన్ని ప్రమాదాలకు తక్షణ సాయం అందుతుంది.

ఇక ఫోన్ కాల్ యే కాదు.. ఎస్ ఎంఎస్ - వాయిస్ కాల్ - ఈ-మెయిల్ - ఈఆర్ ఎస్ ఎస్ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వెంటనే సేవలందించేందుకు చర్యలు తీసుకుంటారు.

ఇక గూగుల్ ప్లే స్టోర్ - యాపిల్ స్టోర్ లో 112 ఇండియా మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. కేంద్ర ప్రవేశ పెట్టిన ఈ సేవల కోసం రూ.321.69కోట్లను కేటాయించారు. ఇప్పటికే 278.66కోట్లను కేటాయించారు. 20 రాష్ట్రాలు - కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఇప్పటికే 112 సేవలు అమలవుతున్నాయి.