అమరావతి ఏమైనా హైదరాబాద్ - బెంగళూరా?

Sat Aug 08 2020 13:00:09 GMT+0530 (IST)

Andhra People Questioning Cbn On Capital Shifting

టీడీపీ అర్థం పర్థం లేని వింతడ వాదన చేస్తోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.  అమరావతి నుండి రాష్ట్రం మొత్తానికి ఆదాయం వస్తున్నట్టు అదే రాజధాని కావాలని కోరడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. అమరావతి ఏమైనా హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై మాదిరి ఆ రాష్ట్రాలకు 60-70 శాతం ఆదాయం తీసుకొని రావడం లేదు కదా? ఎందుకు ఈ మంకు పట్టు అని అడుగుతున్నారు.కొత్తగా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త రాజధాని అమరావతి. అంతేకానీ ఇప్పటికే అభివృద్ధి చెందిన రాజధాని కాదన్నది నగ్నసత్యం. ఇప్పుడు అమరావతిలో పదివేల కోట్లు పెట్టారు అంటున్నారు. పెడితే ఏదో ఒక రోజు ఆ సిటీ కూడా అభివృద్ధి చెందుతుంది. అప్పటిదాకా ఆదాయం లేకుండా.. ఇతర జిల్లాలకు ఖర్చు పెట్టకుండా చోద్యం చూడాలా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం మొత్తం బాగు పడి రాష్ట్ర ఆదాయం పెరగాలి.. అన్ని జిల్లాల్లో ఎంతో కొంత ఆదాయం వచ్చి ఉద్యోగాలు కల్పన చేయవచ్చు కదా అని మేధావులు సూచిస్తున్నారు.

కొత్తగా రాజధాని కట్టాలి అంటే 1.30 లక్షల కోట్లు కావాలి.   అదే డబ్బు ప్రతీ జిల్లాలకు పెంచితే పదివేల కోట్లు వచ్చి ఎన్నో నగరాలు స్మార్ట్ సిటీ అయ్యి ఆదాయం పెరుగుతుంది కదా అని కొంతమంది వాదిస్తున్నారు.  మహారాష్ట్రలో ముంబై పుణేల వల్ల ఆదాయం బాగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా వరంగల్ లో కూడా ఐటీ అభివృద్ధి చేయాలి అని ప్రభుత్వం వసతులు కల్పించి కంపెనీలను రప్పించి మొదలు పెట్టింది. ఉదాహరణకు హైదరాబాద్ లో ఒకప్పుడు షాపింగ్ అంటే అబిడ్స్ కోఠి ఉండేది. కానీ ఇప్పుడు చుట్టూ పక్కల ఎక్కడికక్కడే డెవలప్ అయ్యి అన్ని చోట్ల షాపింగ్ మాల్స్ పడి రాష్ట్ర ఆదాయం పెరుగుతోంది.

అదే విధంగా ఏపీ అంతా డెవలప్ అయితే చంద్రబాబుకు ఏమీ నష్టం. అమరావతి ఒక్కటే బాగుండాలి అని కోరుకోవడంలో మర్మం ఏంటి? అక్కడ టీడీపీ నేతలేమైనా పెట్టుబడులు పెట్టారా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చేసేది కరెక్ట్ గా లేదు అని టీడీపీ వర్గాల్లోనే విమర్శలున్నాయి. చంద్రబాబు లోకేష్ పై పూర్తిగా వ్యతిరేక వస్తుందని అంటున్నారు. పార్టీని గాలికి వదిలేసి అమరావతిని నెత్తినకెత్తుకొని  మా నేతలు మన్ను కొట్టుకొని పోతారని టీడీపీ సీనియర్ నాయకులే వాదిస్తున్నారని టీడీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.