బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.!

Tue Mar 31 2020 15:20:54 GMT+0530 (IST)

Andhra Govt Gives shock to Government Employees

దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఎవరూ పనిచేయకుండా ఇంట్లో ఉన్నారు. పన్నుల వసూళ్లు బంద్ అయిపోయాయి. ప్రభుత్వాలు నడవడం దినదినగండంగా మారింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీయే విరాళాలు సేకరిస్తున్న పరిస్థితి. తెలంగాణ సీఎం కూడా ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు - పెన్షనర్లు సహా అందరికి జీతాల కోత తప్పదని సూచనలు ఇచ్చారు.ఇక ఆర్థిక లోటుతో ఉండే ఏపీలో అదే పరిస్థితి దాపురించింది. లాక్ డౌన్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కానకష్టంగా మారాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఉద్యోగులకు తాజాగా షాక్ తగిలింది.

ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల వేతనాలను 2 విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఉద్యోగులు తీవ్రంగా పనిచేస్తున్నారని సీఎం జగన్ అన్నట్టు తెలిపారు.  నివారణ చర్యలు - రేషన్ వంటి వాటికి ఇంకా అధికంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు.  ఉద్యోగులు కూడా దానికి సహకరించాలని కోరారని తెలిపారు.

కోవిడ్ 19 లాక్ డౌన్ నేపథంలో పనిచేడుతున్న ఉద్యోగులకు వ్యక్తి గత పరిరక్షణ కిట్టులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారన్నారు.  విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయానికి ఒప్పుకుంటున్నామన్నారు. సహకరించాల్సిన నైతిక బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

 ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సీఎం జగన్ ను కలిశారు. ఈనెలలో సగం జీతం ఇస్తామని.. నిధులు సర్ధుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పినట్టు తెలిపారు. కరోనాతో కకావికలం అయిన వేళ తాము కూడా రెండు విడతల్లో జీతాలు తీసుకునేందుకు ఒప్పుకున్నట్టు తెలిపారు.