Begin typing your search above and press return to search.

రైతును వరించిన అదృష్టం.. మట్టికుండలో అరుదైన నిధి..!

By:  Tupaki Desk   |   3 Dec 2022 10:45 AM GMT
రైతును వరించిన అదృష్టం.. మట్టికుండలో అరుదైన నిధి..!
X
అదృష్ట లక్ష్మి ఎవరినీ ఎప్పుడూ కరుణిస్తుందో ముందుగా అంచనా వేయడం కష్టం. మనకు నిజంగా లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే మాత్రం సంపద రూపంలోనైనా.. ఏ క్షణమైనా మన ఇంటి తలుపు తట్టొచ్చు. అదృష్టవంతులు ఒక్క రోజు లక్కీ డ్రాతో కోటీశ్వరుడు కావచ్చు. రోజు పనికి వెళ్లే కూలికి అతడు పని చేసే గనిలో ఓ డైమెండ్ రాయి దొరకొచ్చు. దీంతో అతడి జీవితం ఒక్క రోజులోనే మారిపోవచ్చు.

ఇలాంటి సంఘటనల గురించి మనం ఎప్పుడో ఒకపుడు వినే ఉంటాం. సోషల్ మీడియాలో యుగంలో అయితే చీమ చిటుక్కుమన్నా ప్రపంచవ్యాప్తంగా తెల్సిపోతుంది. ఇక గుప్త నిధులు.. నిధినిక్షేపాల వార్తలై క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు బయటపడిన ఘటనలు ఉన్నాయి.

తాజాగా ఓ రైతు ఆయిల్ ఫామ్ కోసం పైప్ లైన్ పనులు చేపట్టగా అతడిని అనుకోని అతిథి పలుకరించింది. ఓ మట్టికుండలో ఏకంగా 18 పురాతన బంగారు నాణేలు లభించింది. ఈ వార్త క్షణాల్లో జనాలకు చేరడంతో రైతు ఆ బంగారు నాణేలను సంబంధిత తహసీల్దార్ కు అప్పగించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఆంధ్రాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..!

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో మానుకొండ సత్యనారాయణ.. తేజశ్రీకి ఆయిల్ ఫామ్ ఉంది. గత నెల 29న తమ ఆయిల్ తోటలో పైప్ లైన్ పనులు చేపట్టారు. పొలంలో మట్టి తవ్వుతుండగా కూలీలకు ఒక మట్టి పిడత కన్పించింది. దీనిని తెరచి చూడగా అందులో పురాతన కాలం నాటి బంగారు నాణేలు ఉండటంతో అంతా అవాక్కయ్యారు.

సుమారు 18 బంగారు నాణేలు ఒక్కొక్కటి మూడు గ్రాముల బరువుతో ఉన్నాయి. ఈ బంగారు నాణేలను ఆ తోట యజమాని రెవిన్యూ అధికారులకు అప్పగించాడు. దీంతో రెవిన్యూ అధికారులు వాటిని ట్రెజరీకి తరలించారు. అయితే నాణేలు దొరికిన నాలుగు రోజులకు ఆ రైతు రెవిన్యూ అధికారులకు అప్పగించాడనే ప్రచారం జరుగుతోంది. దీంతో నాణేలు ఎన్ని లభ్యమయ్యాయి అనే వాటిపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

ఇక ఈ బంగారు నాణేలు పూర్వీకులు దాచి పెట్టారా? లేదా వారసత్వం సంపదా? అనే విషయాన్ని కలెక్టర్ నిర్ధారిస్తారు. పూర్వీకుల సంపద అయితే వారి వారసులకు వాటాలు వేసి పంచుతారు. వారసత్వ సంపద అయితే దొరికిన నిధిలో ల్యాండ్ ఓనర్ కు 1/5 వంతు ఇస్తారు. లేదా భూమి హక్కుదారులు కాకుండా మరొకరు సాగు చేస్తుంటే.. కౌలుదారులు.. నిధిని వెలికి తీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత మొత్తాన్ని ఇస్తారు. అలాగే నిధి దొరికితే అధికారులకు సమాచారం ఇవ్వకుంటే కాజేయాలనుకుంటే మాత్రం శిక్షార్హులవుతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.