'ఆటో ఇల్లు' చూసి.. ఆనంద్ మహీంద్ర ఫిదా.. తనకూ ఒకటి కావాలట!

Mon Mar 01 2021 08:00:01 GMT+0530 (IST)

Anand Mahindra Suprised By Seeing Auto House

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇల్లు తెగ వైరల్ అవుతోంది. అదే.. మూవింగ్ హౌస్. ఒక వాహనాన్ని ఇంటిగా మార్చేశాడో యువకుడు. ఇందులో కొత్తేముంది? అంటారేమో.. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటి వరకూ బస్సులను కార్ వ్యాన్లను ఇంటిగా మార్చుకోవడం గురించి విన్నాం. కానీ.. సదరు యువకుడు నిర్మించింది ఒక ఆటోలో!అవును.. తమిళనాడుకు చెందిన ఎన్జీ అర్జున్ ప్రభు అనే యువకుడు ఈ ఆటో ఇంటిని నిర్మించాడు. ఈ ఇంటిని ఏడాది క్రితం ఆటోపైన నిర్మించాడు. ఆ ఇంట్లో చిన్న బెడ్‌రూం తోపాటు.. కిచెన్ లివింగ్ ఏరియా వర్క్ ఏరియా బాత్ రూం కూడా ఉన్నాయి.

తాను ఎక్కడి వెళ్తే తనతోపాటు వచ్చేస్తుందీ ఇల్లు. అంటే.. ఆటోను ఇంటితో సహా నడుపుకుంటూ వెళ్లిపోవచ్చన్నమాట. ఈ ఇంటిని నిర్మించడానికి అతనికి లక్ష రూపాయలు ఖర్చు అయ్యిందట. అయితే.. తాజాగా ఈ ఇంటిని చూసి ఫిదా అయ్యారు ఆనంద్ మహీంద్ర.

సోషల్ మీడియాలో ఈ మేరకు స్పందించిన ఆయన.. తమ కంపెనీకి చెందిన బొలేరో వాహనంలో ఇలాంటి ఇంటిని నిర్మించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అర్జున్ ప్రభు నిర్మించిన ఆటో ఇల్లు ఎంతో బాగుందని తాను కూడా బొలేరో వాహనంలో ఇంటిని నిర్మించాలని చూస్తున్నట్టు చెప్పారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చే ఇల్లు భలేగా ఉంది కదూ.. అది కూడా లక్ష రూపాయల ఖర్చుతోనే! ఈ హౌజ్ రెంట్ల గోల భరించేదానికంటే.. ఇలాంటి ఒకటి నిర్మించుకుంటే బాగుండేట్టుంది. ఏమంటారూ..?