Begin typing your search above and press return to search.

వైఎస్ షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ఊహించని ట్విస్ట్

By:  Tupaki Desk   |   16 Jun 2021 9:30 AM GMT
వైఎస్ షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ఊహించని ట్విస్ట్
X
తెలంగాణలో రాజకీయంగా బలపడాలని అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలు పెట్టుకున్నారు. ప్రత్యేకంగా పార్టీకి సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే ఇటీవల కరోనా లాక్ డౌన్ తో షర్మిల పార్టీ ప్రకటన వాయిదా పడింది. మరో తేదీని నిర్ణయించి ఆమె ముందుకు వెళుతున్నారు.

తాజాగా బుధవారం నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ లో షర్మిల పర్యటించాల్సి ఉంది. నిరుద్యోగంతో ఆత్మహత్యాయత్నం చేసిన నీలకంఠసాయి అనే యువకుడిని పరామర్శించాల్సి ఉంది. అయితే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడి ఇంటికి మరికాసేపట్లో షర్మిల చేరుకుంటుందనేలోపే అతడి ఆచూకీ మిస్ కావడం సంచలనమైంది. యువకుడి ఇంటికి తాళం వేసి ఉందట.. షర్మిల పరామర్శకు వస్తుందని నీలకంఠసాయిని కిడ్నాప్ చేశారని షర్మీల వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఇక ఎమ్మెల్యే సైదిరెడ్డి హస్తం ఇందులో ఉందని షర్మిల వర్గం ఆరోపిస్తోంది. అయితే షర్మిలకు అండగా ఉంటామని ముందుపడిన నేతలంతా ఇప్పుడు మౌనం దాల్చారని తెలుస్తోంది. షర్మిల నియమించిన అడ్ హక్ కమిటీ నేతలు ఒక్కరొక్కరు రాజీనామాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున జులై 8న వైఎస్ షర్మిల పార్టీ పేరును బహిరంగంగా ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు. పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ రాశారు.పార్టీకి సంబంధించి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడ్ హక్ కమిటీలను కూడా షర్మిల ఇవాళే ప్రకటించారు. ఇప్పుడు ఆ నేతలంతా జారుకుంటున్న పరిస్థితి నెలకొంది.