అమెరికాలో భారతీయుడిపై దాడి.. విచక్షణారహితంగా కత్తిపోట్లు

Fri Sep 30 2022 15:26:08 GMT+0530 (India Standard Time)

An Indian was attacked with a knife in public in New York

అమెరికాలో భారతీయులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి.గత రెండు మూడు నెలలుగా ఏదో ఒక చోట భారతీయులపై విద్వేష దాడులు జరుగుతూనే ఉన్నాయి.ఇటీవలే డల్లాస్ లోని ఓ రెస్టారెంట్ లో ఎస్మలార్డ ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో విద్వేష దాడి జరిగింది.  తాజాగా భారత సంతతికి చెందిన ఫుడ్ డెలివరీ బాయ్ భారత్ భాయ్ పటేల్ పై అమెరికాలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశారు. న్యూయార్క్ నగర శివార్లలోని క్వీన్స్ లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఉబెర్ ఈట్స్ లో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం ఎప్పటిలాగానే తన విధుల్లో లోయర్ ఈస్ట్ సైడ్ ప్రాంతం నుంచి ఫుడ్ ఆర్టర్ రావడంతో డెలివరీ చేయడానికి అక్కడి వెళ్లాడు.

అయితే మార్గమధ్యంలో ఓ వ్యక్తి పటేల్ ను అడ్డుకొని వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు.  కానీ పటేల్‌కు మరింత బాధ కలిగించిన విషయం ఏమిటంటే పక్కనున్న వారెవరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం లేదా తరువాత ఏమీ సహాయపడలేదు. దీంతో ఆ బాధలోనే అతను స్వయంగా 911కి ఎమర్జెన్సీ కాల్ చేయాల్సి వచ్చింది.  పోలీసులు వచ్చి బెల్లేవ్ ఆసుపత్రికి తరలించారు.

రక్తపు మడుగులో పడిపోయిన భారత్ పటేట్ ను వదిలేసి అతడి బైక్ పై నిందితుడు పారిపోయాడు. రోడ్డుపై జనం ఉన్నప్పటికీ ఎవరూ భారత్ పటేల్ కు సహాయం చేయలేదు.

36 ఏళ్ల పటేల్ క్వీన్స్‌లో నివసిస్తున్నాడు. అతడికి 6 ఏళ్ల కొడుకు భార్య ఉన్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.  రివింగ్‌టన్ స్ట్రీట్ సమీపంలోని అలెన్ స్ట్రీట్‌లో వ్యక్తి సీన్ కూపర్ గా గుర్తించి అతడిని ఇ-బైక్‌ను పట్టుకున్నారు.పోలీసులకు తెలిసిన సీన్ కూపర్   పై ఇప్పటికే  103 కేసులున్నట్టు గుర్తించారు. దుండగుడు బిగ్ కూప్ అనే మారుపేరుతో పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

భరత్ పటేల్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ దాడిని చూసి తాను ఆశ్చర్యపోయానని.. ప్రస్తుతం  మెరుగ్గా ఉన్నానని చెప్పాడు.దీనిని జాతి విద్వేష దాడిగా స్థానిక ఇండియన్ కమ్యూనిటీ ఆరోపిస్తోంది. ఘటనకు బాధ్యుడైన నిందితుడిని పట్టుకోవాలని భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.