డిజిటల్ అత్యాచారం: మైనర్ ను వదలని 80 ఏళ్ల వృద్ధుడి..

Tue May 17 2022 10:59:26 GMT+0530 (IST)

An 80 year old man who Raped a minor.

కాటికి కాలు జాపాల్సిన వయసులో ఉన్న ఒక 80 ఏళ్ల వృద్ధుడు మైనర్ బాలికపై డిజిటల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఈ రేప్ కేసు నమోదై సంచలనం సృష్టించింది. 80 ఏళ్ల వృద్ధుడు తనను 7 ఏళ్లుగా లైంగిక వేధిస్తున్నాడని 17 ఏళ్ల అమ్మాయి ఆరోపిస్తోంది. దీంతో పోలీసులు నిందితుడు మౌరిస్రైడర్ ను అదుపులోకి తీసుకున్నాడు.మౌరిస్ అనే 80 ఏళ్ల వృద్ధుడు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అలహాబాద్ కు చెందిన ఇతడు నోయిడాలో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తున్నాడు. ఇంట్లో పనిచేసేందుకు ఓ బాలికను పెట్టుకున్నాడు. ఏడేళ్లుగా ఆ బాలిక ఆ వృద్ధుడి ఇంట్లోనే పనిచేస్తోంది. మౌరిస్ తనను పనిలో చేరినప్పటి నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను వీడియో ఆడియో రికార్డులను పోలీసులు బాలిక అందజేసింది. దీంతో పోలీసులు ఈ వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డిజిటల్ రేప్ అభియోగాలు మోపారు.

డిజిటల్ రేప్ కేసు కొత్తగా చేర్చారు. ఈ డిజిటల్ రేప్ అంటే బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతివేళ్లు కాలివేళ్లు లేక వస్తువులను చొప్పించడాన్ని ఈ నేరంగా పరిగణిస్తారు. ఉత్తరప్రదేశ్ లో డిజిటల్ రేప్ కేసు నమోదు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.  

గతంలో ఈ డిజిటల్ రేప్ ను లైంగిక నేరంగా పరిగణించే వారు కాదు. 2013లో పార్లమెంట్ లో ఈ కొత్త రేప్ చట్టాలు ఆమోదించబడే వరకూ డిజిటల్ రేప్ ను వేధింపుగా గుర్తించేవారు. అయితే 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం హత్య కేసు తర్వాత కొత్త చట్టాలు తీసుకొచ్చారు.

జాతీయ స్తాయిలో ఏర్పడిన నిరసన వల్ల ప్రభుత్వం స్పందించి చట్టాలను సవరించారు. ప్రైవేటు భాగాల్లో ఏదైనా బలవంతంగా ప్రవేశపెడితే దానిని అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు.

భారతదేశంలో ఇప్పుడు ఎవరైనా డిజిటల్ రేప్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చినట్లైతే నిందితులపై విస్తృతస్థాయి ఐపీసీ సెక్షన్ (376 రేప్) కింద కేసు నమోదు చేస్తారు. కానీ డిజిటల్ రేప్ కేసుల్లో నేరారోపణలు శిక్షలు విధించడం ఇప్పటికే దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి.