బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎంకు పాజిటివ్

Mon Jul 13 2020 09:45:56 GMT+0530 (IST)

Amzad Basha Tested Positive For Corona Virus

సామాన్యులు.. సెలబ్రిటీలు.. ఆ మాటకు వస్తే ఎవరైనా సరే.. తన బారిన పడాలన్నట్లుగా వ్యవహరించే కరోనా బారిన పడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. ఇప్పటికే పలువురు ప్రముఖులకు పాజిటివ్ రావటం తెలిసిందే. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఒకవైపు.. రాజకీయ నేతలతోపాటు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు.ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ భాషాకు పాజిటివ్ గా తేలటమే కాదు.. ఆయన కుటుంబంలోని పలువురు సైతం కరోనా బారిన పడటం గమనార్హం. తాజాగా ఆయనతో పాటు.. ఆయన సతీమణి.. కుమార్తెలకు పాజిటివ్ గా తేలింది. దీంతో.. మెరుగైన చికిత్స కోసం తన కుటుంబంతో సహా తిరుపతిలోని స్విమ్స్ నుంచి హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లినట్లుగా చెబుతున్నారు.

కరోనా ప్రారంభంలో ఏపీ డిప్యూటీ సీఎం మీద మర్కజ్ వెళ్లివచ్చినట్లుగా విమర్శలు వచ్చాయి. అక్కడికి వెళ్లి వచ్చి కూడా ఆ సమాచారాన్ని ఇవ్వలేదన్న మాట ఉంది. అయితే.. ఆ ఆరోపణలపై డిప్యూటీ సీఎం స్పందించింది లేదు. ఇదిలా ఉంటే.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. డిప్యూటీ సీఎం ఇంట్లోని వారికి పాజిటివ్ రావటం విస్మయం వ్యక్తమవుతోంది.