రంగంలోకి అమిత్ షా:రజినీ అళగిరితో చర్చలు?

Sat Nov 21 2020 12:45:28 GMT+0530 (IST)

Amit Shah meets Rajinikanth?

బీజేపీ ట్రబుల్ షూటర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఈరోజు తమిళనాడులో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తమిళ పాలిటిక్స్ హీటెక్కాయి. ఈసారి డీఎంకే గెలుపు పక్కా అన్న ఊహాగానాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.ఇప్పటికే గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తమిళనాడులో క్లీన్ స్వీప్ చేసేసింది. మెజార్టీ సీట్లను దక్కించుకుంది. బీజేపీ-అన్నాడీఎంకే బొక్క బోర్లా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అధికార అన్నాడీఎంకేను సమయాత్తం చేయడంతోపోటు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను చిత్తుగా ఓడించేలా బీజేపీ ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తోంది.

అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు చెన్నైలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అక్కడికి చేరుకోనున్నారు. అనంతరం ఏఐడీఎంకే ముఖ్య నేతలతో చర్చిస్తారు.

ఇక తమిళ పాలిటిక్స్ లో కీలక వ్యూహాలకు అమిత్ షా పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ డీఎంకే మాజీ అధ్యక్షుడు అళగిరితో అమిత్ షా భేటి అవుతారని తెలుస్తోంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాలని రజినీని అమిత్ షా కోరుతారని తెలుస్తోంది.

ఇక బీజేపీలో చేరాలని స్టాలిన్ అన్న అళగిరిని అమిత్ షా కోరుతారని..వీలైతే బీజేపీలో అళగిరిని చేర్పించేలా అమిత్ షా రాజకీయం చేయబోతున్నారని తెలుస్తోంది.