బీజేపీ..అంతా అమిత్ షా కనుసన్నల్లోనే?

Sat Jan 18 2020 12:20:01 GMT+0530 (IST)

Amit Shah Control on BJP

ఒకే వ్యక్తి రెండు కీలకమైన పదవుల్లో ఉండటం.. భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న నియమనిబంధనలకు వ్యతిరేకం. అయితే అమిత్ షా మాత్రం దీనికి కొంత మినహాయింపును పొందారు. ఒకవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు కేంద్ర హోం మంత్రిగానూ ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఇలా జంట పదవుల్లో ఆయన కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎవ్వరూ అంత గట్టిగా మాట్లాడలేదు. అయితే ఎందుకైనా మంచిది అన్నట్టుగా అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటూ ఉన్నారు.ఆ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తూ ఉన్నారు. ఆ పదవి నడ్డాకు దక్కుతుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. చివరకు అవే ఊహాగానాలు నిజం అవుతున్నాయి. ఈ నెల 20వ తేదీన నడ్డా నామినేషన్ వేయనున్నారని సమాచారం. అలా ఆయన జాతీయాధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమే అని తెలుస్తోంది.

అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా.. అమిత్ షా కనుసన్నల్లోనే సాగుతోందని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ జాతీయాధ్యక్ష పదవి నుంచి అమిత్ షా తప్పుకుంటున్నా.. పార్టీ పై ఆయన అథారిటీ మాత్రం కొనసాగుతుందనే  అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అందుకే అందుకు అనుగుణంగా ఆ పదవిని నడ్డాకు అప్పగిస్తున్నారని ఢిల్లీ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

భారతీయ జనతా పార్టీ కి అమిత్ షా అధ్యక్షుడులాంటి వారే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై సోనియాగాంధీ అథారిటీ లాగా బీజేపీ పై అమిత్ షా అథారిటీ ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్ కు వేరే వాళ్లు ఎవరైనా ఏ పదవిలో ఉన్నా వారు నామమాత్రం అయినట్టుగా బీజేపీలో మోడీ - అమిత్ షా యేతరులు ఏ పార్టీలో ఉన్నా వారు కూడా నామమాత్రమే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.