లవర్ తో ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్ కు రూ.500 పంపిన అమిత్ మిశ్రా

Thu Sep 29 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Amit Mishra sent Rs 500 to a fan to enjoy with lover

భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక అభిమాని పట్ల తన మంచితనం చూపించి మనసు గెలుచుకున్నాడు. ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా అమిత్ మిశ్రాను రూ. 300 పంపమని అడిగాడు. తన స్నేహితురాలిని డేట్‌కి తీసుకెళ్లాలని ఈ ఆర్థిక సాయం చేయాలని కోరాడు. దానికి బదులుగా అమిత్ మిశ్రా రూ. 500 పంపారు. దాన్ని ట్విట్టర్ లో షేర్ చేసి అభిమానికి శుభాకాంక్షలు తెలిపాడు.  ఈ మధ్యకాలంలో అమిత్ మిశ్రా ట్విట్టర్ లో తెగ యాక్టివ్ గా ఉంటున్నాడు. టీమిండియాకు ఆడే రోజుల్లో కీలకమైన లెగ్ స్పిన్నర్ గా మిశ్రా కొనసాగాడు. ఇక ప్రస్తుతం రిటైర్ అయ్యాక ట్విట్టర్ లోనే కాలం గడుపుతున్నాడు.  తన ట్విట్టర్ హ్యాండిల్‌లో చమత్కారమైన మెసేజ్ లను  పంచుకుంటూ టీమిండియాను విమర్శిస్తున్న వారికి కౌంటర్లు ఇస్తూ కాలం గడుపుతున్నాడు.  మిశ్రాకు సోషల్ మీడియాలో ఆయన చేసే పనులతో ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది.  

ఈ స్పిన్ మాంత్రికుడు  ట్విట్టర్ వినియోగదారులతో చాలా సరదాగా ఉంటూ వారి సమస్యలను తీరుస్తున్నాడు.   బుధవారం సురేశ్ రైనా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 సెమీఫైనల్ సందర్భంగా అద్భుతమైన ఫ్లయింగ్ క్యాచ్ పట్టాడు. ఇండియా లెజెండ్స్ కోసం ఆడుతున్న రైనా ఆస్ట్రేలియా లెజెండ్స్ టీం క్రికెటర్ బెన్ డంక్‌ను అవుట్ చేశాడు. రైనా క్యాచ్‌ని పట్టుకోవడంపై స్పందిస్తూ మిశ్రా ఆ వీడియోను రీట్వీట్ చేశాడు.. రైనా సంవత్సరాలు వెనక్కిపంపి మరీ పూర్వపు ఆట ఆడుతున్నాడని.. తన టైమ్ మెషీన్‌ను తనకు అరువుగా ఇవ్వాలని మిశ్రా సరదాగా వ్యాఖ్యానించాడు.  రైనా నమ్మదగిన ఫీల్డర్ అంటూ కొనియాడారు.

రైనా కోసం మిశ్రా చేసిన ట్వీట్‌పై ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. ‘తన ప్రేయసితో డేటింగ్‌కు వెళ్లేందుకు రూ.300 పంపాలని’ అమిత్ మిశ్రాను వేడుకుంటూ  అభ్యర్థించాడు. దీనికి వెంటనే స్పందించిన అమిత్ మిశ్రా తన యూపీఐ ద్వారా రూ.500లను ఆ నెటిజన్ కు పంపి ఆశ్చర్యపరిచాడు. ఓ 200 ఎక్కువనే పంపి ప్రియురాలితో డేటింగ్ కు వెళ్లి ఎంజాయ్ చేయాలంటూ సూచించాడు.   మిశ్రా నిజంగా అభిమానికి రూ. 500 పంపి అందరినీ ఆనందపరిచాడు. "మీ డేట్ కోసం ఆల్ ది బెస్ట్ " అని భారత మాజీ స్పిన్నర్ ట్విట్ చేసి.. డబ్బులు పంపిన లావాదేవీ స్క్రీన్ షాట్‌ను ట్వీట్ చేశాడు.మిశ్రా చేసిన పనికి నెటిజన్లు వేయినోళ్ల కొనియాడుతున్నారు.

రాయ్‌పూర్‌లో ఇండియా లెజెండ్స్ -ఆస్ట్రేలియా లెజెండ్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది అందువల్ల దానిని గురువారానికి వాయిదా వేయవలసి వచ్చింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంద..షేన్ వాట్సన్ జట్టు వారి సంబంధిత 20 ఓవర్లలో 171/5 స్కోర్ చేయగలిగింది. రిటైర్ అయిన ఆటగాళ్లంతా ఈ టోర్నీలో ఆడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.