Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ‘ఒమిక్రాన్’ టెన్షన్!

By:  Tupaki Desk   |   3 Dec 2021 11:30 AM GMT
హైదరాబాద్ లో ‘ఒమిక్రాన్’ టెన్షన్!
X
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన మహిళలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ లో ఆందోళన నెలకొంది. ఆమెను వెంటనే అధికారులు ఆస్పత్రికి తరలించారు. తాజాగా ఎయిర్ పోర్టులో నిర్వహించిన పరీక్షల్లో మరో 13మందికి పాజిటివ్ గా తేలినట్లు సమాచారం.

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చినట్టైంది. భారత్ లో సెకండ్ వేవ్ సమయంలో విలయతాండవం చేసి లక్షల మందిని బలిగొన్న కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ 6 రెట్లు వేగంగా సంక్రమిస్తుందని హెచ్చరించింది.

తొలిసారిగా సౌతాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ నెల తిరగకుండానే చాలా దేశాలకు విస్తరించింది. తాజాగా భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా బెంగళూరులో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. హైదరాబాద్ లోనూ రెండు రోజుల కిందట ఒమిక్రాన్ కలకలం చెలరేగింది. విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్ లో ఉంచారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపారు.

ఇక విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వారిలో 13మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశీ ప్రయాణాకులకు 13మందికి పాజిటివ్ గా తేలడంతో హైదరాబాద్ లో అలెర్ట్ ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన వారిని ప్రస్తుతం టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. వారికి సోకిన కరోనా వేరియంట్ పై స్పష్టత రావాల్సి ఉంది.