Begin typing your search above and press return to search.

15 వేల డాలర్లు పెట్టి ఆ మట్టిని కొననున్న అమెరికా ... ప్రత్యేకత ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   5 Dec 2020 6:22 AM GMT
15 వేల డాలర్లు పెట్టి ఆ మట్టిని కొననున్న అమెరికా ... ప్రత్యేకత ఏమిటంటే ?
X
అనంతమైన ఈ విశ్వం లో ఎన్నో వింతలు , విశేషాలు కొలువై ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికి మనిషి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కొన్నింటిని ఛేధించాడు. ఆ చంద్రమామను అందుకున్నాడు. చందమామ పై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ నాసా చంద్రుడిపై ఉండే మట్టిని కొనటానికి కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రుడి మీద మట్టి కొనటానికి నాసా 15 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో 11,05,803 రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే మట్టిని కొనటానికి నాసా ఇప్పటికే నాసా నాలుగు ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ విషయంపై నాసా కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ డివిజన్ డైరెక్టర్ ఫిల్ మక్ అలిస్టర్న్‌ మాట్లాడుతూ..చంద్రుడిపై మట్టిని తీసుకువచ్చేందుకు మేము నాలుగు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. దాని కోసం 25,001 డాలర్లకు చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే వాటిని కొనుగోలు చేయనున్నామని AFP వార్తా సంస్థకు తెలిపారు.

ఇక 2022-23 లో ఈ కంపెనీలు చంద్రుడి మీద నుంచి మట్టిని తెచ్చి నాసాకు అప్పగిస్తాయి. ఈ కంపెనీలు చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే ఈ మట్టిని రెగోలిత్ అంటారు. మట్టితో పాటు దాని సేకరణ, సేకరించిన పదార్థాలకు సంబంధించిన చిత్రాలను కూడా అందిస్తాయి. ఈ మట్టిని నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏకైక భాగస్వామిగా వినియోగించనుంది. అయితే ఈ మట్టిని భూమికి తీసుకువస్తారా లేదా అనే దాని గురించి ఎటువంటి స్పష్టత లేదు.