Begin typing your search above and press return to search.

భారత్ -చైనా యుద్ధం.. ఇండియాకి మద్దతుగా అమెరికా !

By:  Tupaki Desk   |   7 July 2020 4:30 PM GMT
భారత్ -చైనా యుద్ధం.. ఇండియాకి మద్దతుగా అమెరికా !
X
గాల్వాన్ ఘటన జరిగిన తరువాత భారత్ -చైనా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా సహా చాలా దేశాలు ఇండియాకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ తరుణంలో చైనా రోజుకొక వ్యూహంతో ముందుకు వస్తుంది. అయితే , చైనా పప్పులు ఏమి ఉడకకపోవడంతో ఇప్పటికే గాల్వాన్ లోయ నుండి 2 కిలోమీటర్లు తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంది. ఈ వ్యవహారం ఇలా సాగుతున్న తరుణంలోనే వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మేము ఎక్కడ ఉన్నాసరే అత్యంత శక్తివంతమైన ఆధిపత్య శక్తిగా ఉన్నామని, చైనానే కాదు మరే దేశం పగ్గాలు చేపట్టలేదని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ మరియు చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందిస్తూ మెడోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ చైనా సముద్రంలో 2 యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ సంచరించాయి అన్న వార్త వచ్చిన మూడు రోజుల తర్వాత మెడోస్ ఈ విధంగా స్పందించారు. ఇప్పటికే కరోనా వైరస్ విషయంలోనూ, చైనాతో వాణిజ్యంలోనూ, తాజాగా హాంకాంగ్ విషయంలోనూ అన్ని వ్యవహారాల్లో చైనాతో యు.ఎస్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. చైనాకు చెక్ పెట్టాలని చూస్తోంది.

ఈ సమయంలో దక్షిణ చైనా సముద్రంలో రెండు యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ లు సంచరించడం ఉద్రిక్తతలకు చిహ్నంగా చైనా ఆరోపించింది. ఆ చర్యతో ఇండో-పసిఫిక్కు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చింది యూఎస్ఇప్పటికే ఇండియా బాటలో చైనా టిక్ టాక్ తో సహా, చైనీస్ యాప్ లను నిషేధించింది. చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి నిర్ణయం తీసుకున్న యూఎస్, ఒకవేళ నిజంగా యుద్ధమే వస్తే ఇండియా పక్షాన చైనాపై దూకుడు చూపించనుంది అన్న విషయం వైట్ హౌస్ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలతో ఇట్టే అర్థమవుతుంది.

లడఖ్‌ లోని వాస్తవ నియంత్రణ రేఖపై ఉద్రిక్తతలు తగ్గి చైనా మరియు భారత దళాలు గాల్వన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద జూన్ 15 ఘర్షణ జరిగిన ప్రదేశం నుండి 1.8 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళాయి. కార్ప్స్క మాండర్ స్థాయిలో సమావేశంలో నిర్ణయించిన మేరకు దశలవారీగా సైన్యం ఉపసంహరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా కాదని ఇండియా తో యుద్ధానికి వస్తే ఇండియాకు మద్దతు పలకడానికి చాలా దేశాలు, బలమైన దేశాలు ముందుకు వస్తూ ఉండటం గమనార్హం.