Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికా 'వార్నింగ్' బెల్.!

By:  Tupaki Desk   |   5 Dec 2022 7:30 AM GMT
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికా వార్నింగ్ బెల్.!
X
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొంతకాలంగా హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి మొదలైన వార్ నిరాటకంగా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. యుద్ధం ప్రారంభమైన సమయంలో రష్యన్ సేనల ధాటికి ఉక్రెయిన్ ఒకట్రెండు రోజుల్లో దారికి వస్తుందని అంతా భావించారు. .అయితే అందరి అంచనాలను ఉక్రెయిన్ తలకిందులు చేస్తూ రష్యాతో ఢీ అంటే ఢీ అంటోంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎవరికీ వారు తగ్గేదెలే అంటున్నారు. ఈక్రమంలోనే ఉక్రెయిన్-రష్యా మధ్య తొమ్మిది నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఇరు దేశాలకు చెందిన వేలాది మంది సైనికులు.. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం శోచనీయంగా మారింది.

ఇటీవల ఉక్రెయిన్ యుద్ధంలో తమ సైనికులు ఎంతమంది మరణించారో అధికారికంగా ప్రకటించింది. రష్యా దాడిలో ఉక్రెయిన్ చెందిన సుమారు 13వేల మంది మృతి చెందారని పేర్కొంది. అయితే ఉక్రెయిన్ పౌరులు భారీ సంఖ్యలో చనిపోయి ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే రష్యా సైనికులు లక్ష నుంచి లక్షన్నర వరకు మృతి చెంది ఉండొచ్చని ఉక్రెయిన్ ప్రకటించింది.

అయితే ఐరోపా కమిషన్ మాత్రం ఇందుకు భిన్నంగా వివరాలను వెల్లడించింది. గత తొమ్మిది నెలలుగా యుద్ధం నిరాటంకంగా కొనసాగుతుండటంతో ఇరుదేశాల చెందిన సైనికులు లక్షల్లో మరణించడమో.. గాయపడటమో జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ లక్ష మంది సైనికులను కోల్పోగా.. 20వేల మంది పౌరులు మృతి చెంది ఉంటారని ఐరోపా కమిషన్ అంచనా వేసింది.

ఇరుదేశాల మధ్య లక్షల్లో సైనికులు.. వేలాదిగా సామాన్య పౌరులు మృతి చెందాడటంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మానవతవాదులు యుద్దాన్ని ఇప్పటికైనా ముగించేలా ఐక్య రాజ్య సమితి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న అమెరికా యుద్ధంపై తాజాగా వార్నింగ్ బెల్స్ మోగించింది.

ప్రస్తుత శీతాకాలం నేపథ్యంలో మంచు విపరీతంగా కురుస్తుండడంతో సైనికులు యుద్ధం చేస్తూనే తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారంగా శీతాకాలంలో దాడుల ఉధృతి తగ్గిందని పేర్కొంది. అయితే ఉక్రెయిన్ మౌలిక వసతులపై రష్యా దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించింది.

శీతాకాలం ముగిసిన తర్వాత రష్యా తన దాడులను మరింత పెంచే అవకాశం ఉందని అమెరికా అంచనా వేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని అమెరికా భావిస్తోంది. ఏది ఏమైనా గత తొమ్మిది నెలలుగా యుద్ధం నిర్విరామంగా కొనసాగుతుండటంతో ఇరు దేశాలకు చెందిన వేలాది మంది సైనికులు ప్రాణాలను కోల్పోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.