టెస్టులు ఎక్కువ చేశాం అందుకే ఎక్కువ మరణాలు!: ట్రంప్

Wed Aug 05 2020 16:40:20 GMT+0530 (IST)

America President Donald Trump On Corona Situation In America

కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేసులు మరణాల్లో అమెరికా అన్ని దేశాల కంటే ముందు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 18710782 కోట్ల కేసులు నమోదు కాగా 704491 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇందులో అమెరికాలోనే దాదాపు 50 లక్షల కేసులు 160318 మరణాలు ఉన్నాయి. కేసుల్లో అమెరికా వాటా నాలుగొంతుల కంటే ఎక్కువగా ఉంది. మరణాల్లో దాదాపు అంతే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. కరోనాపై తాము సరైన చర్యలు తీసుకున్నామని ట్రంప్ ఎప్పటికప్పుడు చెబుతున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరోనాపై అమెరికా చర్యలను ట్రంప్ విచిత్రంగా సమర్థించుకున్నారు. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరోనాను అమెరికా బాగా కట్టడి చేసిందని తమ దేశంలో మరే దేశమూ కట్టడి చేయలేదని చెప్పడం గమనార్హం. చైనా భారత్ మినహా మిగతా దేశాల కంటే అమెరికా చాలా పెద్ద దేశామని ఇప్పుడు చైనా భారత్లోను కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. తొలి కేసు నమోదైన తర్వాత దాదాపు ఎనిమిది నెలల్లో 1.60 లక్షల మంది మృత్యువాత పడ్డారు.

దీనిపై ట్రంప్ స్పందిస్తూ అమెరికాలో టెస్టులు అందరి కంటే ఎక్కువగా చేస్తున్నామని అందుకే మిగతా దేశాలతో పోలిస్తే కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని చెప్పారు. వేరే ఏ ఇతర దేశం అమెరికా చేసినన్ని టెస్టులు చేయడం లేదన్నారు. చాలా బాగా కట్టడి చేశామన్నారు. ఇండియాలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే టెస్టులు మనకంటే తక్కువగా ఉన్నాయన్నారు. మరణాలను కూడా దేశంలోని జనాభాపరంగా కాకుండా కేసుల పరంగా చూడాలని ట్రంప్ చెప్పడం గమనార్హం. అలా చూస్తే మరణాలు మన వద్ద తక్కువగా ఉన్నాయన్నారు.

జాన్స్ హాప్కిన్స్ డేటా ప్రకారం అమెరికాలో 100000కు 47 మరణాలు ఉన్నాయి. అయితే కేసుల పరంగా చూస్తే 100 కేసులకు 3.3 శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. అమెరికా ఎక్కువ టెస్టులు చేసింది కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే మన దేశంలోనే మరణాలు తక్కువగా ఉన్నాయన్నారు. అయితే కరోనా కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని ఎక్కువమంది అమెరికన్లు పెదవి విరుస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.