Begin typing your search above and press return to search.

అమెరికాను చూసి.. మోడీ ఫాలో అవుతున్నారా? ఎంద‌కంటే!

By:  Tupaki Desk   |   18 April 2021 8:30 AM GMT
అమెరికాను చూసి.. మోడీ ఫాలో అవుతున్నారా? ఎంద‌కంటే!
X
దేశంలో క‌రోనా తీవ్రత గ‌త ఏడాదిని మించిపోయింది. వాస్త‌వానికి క‌రోనాను కోవిషీల్డ్‌, కోవ్యాగ్జిన్ వంటి టీకాలు తీసుకువ‌చ్చిన త‌ర్వాత‌.. ఇక క‌రోనాతో పెద్ద‌గా ముప్పు ఉండ‌ద‌ని కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు భా వించింది. అయితే.. అనూహ్యంగా క‌రోనా తీవ్రత పెరిగిపోయింది. నిన్న ఒక్క‌రోజే.. దేశ‌వ్యాప్తంగా అధికారికం గా 1300 మంది చ‌నిపోతే.. అన‌ధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయి న‌ప్ప‌టికీ.. మోడీ స‌ర్కారు కానీ, ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కానీ.. లాక్‌డౌన్ ఊసు ఎత్త‌డం లేదు.

నిజానికి గ‌త ఏడాది ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. క‌రోనా దేశంలోకి ప్ర‌వేశించిన 20 రోజుల్లోనే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వెంట‌నే లాక్డౌన్ ప్ర‌క‌టించారు. దీంతో మ‌ర‌ణాలు త‌గ్గి.. కొంత దేశం తెరిపిన ప‌డింది. దీనిని మోడీ స‌ర్కారు గొప్ప‌గా ప్ర‌చారం చేసుకుంది. అభివృద్ధి చెందిన దేశాలు.. మ‌ర‌ణాల్లో పోటీ ప‌డుతున్నాయ ‌ని కానీ, మ‌నం మాత్రం ఆది నుంచి క‌రోనాను క‌ట్ట‌డి చేశామ‌ని.. మోడీ ఎక్క‌డిక‌క్క‌డ త‌న గొప్ప‌ను చాటుకు న్నారు. కానీ, గ‌త ఏడాదిని మించిన తీవ్ర‌త‌తో క‌రోనా రెండోద‌శ‌లో విజృంభిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఉలుకు ప‌లుకు లేకుండా లాక్‌డౌన్ మాటే మాట్లాడ‌డం లేదు.

కేవ‌లం ప్ర‌జ‌లు ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని .. సూచిస్తున్నారు. అదేస‌మ‌యంలో శానిటైజ‌ర్లు, మా స్కుల కొర‌త రాకుండా నిరంత‌రం ఉత్ప‌త్తి చేయాల‌ని, అదేవిధంగా క‌రోనా వ‌చ్చిన వారికి అందించేందు కు ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి స‌ర‌ఫ‌రాను కూడా 24 గంట‌లూ కొన‌సాగించాల‌ని ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌రాద‌ని కూడా మోడీ స్ప‌ష్టం చేశారు. దీంతో ఇప్పుడు లాక్ డౌన్ ఎందుకు విధించ‌లేక పోతున్నార‌నే చ‌ర్చ దేశ‌వ్యా ప్తంగా ఆస‌క్తిగా మారింది. దీనికి ప్ర‌ధానంగా మోడీ.. అమెరికాను ఫాలో అవుతున్నార‌ని అంటున్నారు. గ‌త ఏడాది లాక్‌డౌన్ విధించిన బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా.. త‌దిత‌ర సంప‌న్న దేశాల్లోనే ఆర్థిక ప‌రిస్థితి మంద‌గించింది.

కానీ, ఎన్ని క‌రోనా కేసులు వ‌చ్చినా.. ఎంత‌మంది మృతి చెందిన ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంద‌నే భ‌యంతో అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ లాక్‌డౌన్ జోలికి పోలేదు. దేశంలో న‌లువైపుల నుంచి లాక్‌డౌన్ విష‌యంలో ఒత్తిళ్లు వ‌చ్చినా.. ఆయ‌న వెన‌క్క త‌గ్గ‌లేదు. దీంతో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు త‌ప్ప అమెరికాలో ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయిన సంద‌ర్భం రాలేదు. కానీ, గ‌తంలో పెద్ద‌గా కేసులు లేన‌ప్పుడే.. లాక్‌డౌన్ విధించిన కార‌ణంగా భార‌త్‌లో ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. ఇప్పటికీ వీటినుంచి దేశంలో కోలుకోలేదు.

ఈ నేప‌థ్యంలో ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేద‌ని భావిస్తున్న మోడీ.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడి త‌ప్ప‌కుండా చూడాల‌నే ఏకైక ల‌క్ష్యంతో లాక్‌డౌన్ జోలికి పోవ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. చిత్రంగా గ‌తంలో లాక్డౌన్‌తో దెబ్బ‌తిన్నామ‌ని చెప్పిన ప‌లు వ్యాపార సంస్థ‌లు ఇప్పుడు.. స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్‌కు సిద్ధ‌మ‌వుతుండ‌డం.. వ్యాపార స‌మ‌యాల‌ను కుదించుకోవ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ప్ర‌జ‌లు కూడా స్వ‌చ్ఛందంగానే నియంత్ర‌ణ పాటిస్తున్నార‌ని తెలుస్తోంది. అంటే.. ప్ర‌భుత్వం తాను చేయ కుండానే ప్ర‌జ‌ల‌ను స్వ‌చ్ఛంద మార్గంవైపు ప‌య‌నించేలా చేసింద‌నడంలో సందేహం లేదు.