Begin typing your search above and press return to search.

ఇరాన్ పై అమెరికా సైబర్ దాడి

By:  Tupaki Desk   |   24 Jun 2019 11:38 AM GMT
ఇరాన్ పై అమెరికా సైబర్ దాడి
X
బెదిరింపులు అయిపోయాయి.. కవ్వింపులు ముగిసిపోయాయి. ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతీసే కొత్త కుట్రలకు ప్రపంచ పెద్దన్న అమెరికా దిగిందట.. ఈ మేరకు ఇరాన్ పై అణుబాంబులు వేయాలన్న ప్లాన్ కు స్వస్తి పలికి ఇప్పుడు సైబర్ దాడులకు తెగబడుతోందని సమాచారం.

తాజాగా తమ డ్రోన్ విమానాన్ని కూల్చిన ఇరాన్ పైకి అణుబాంబులు వేద్దామని డిసైడ్ అయ్యి చివరి నిమిషంలో వెనక్కి తగ్గానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపి సంచలనం సృష్టించాడు. అయితే ఇప్పుడు సైబర్ దాడులకు అమెరికా దిగుతోంది.

ఇరాన్ ఆర్మీ కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకొని అమెరికా సైబర్ దాడులకు దిగుతున్నట్టు సమాచారం. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను నియంత్రించే ఇరాన్ ఆర్మీ కంప్యూటర్లపై అమెరికా సైబర్ దాడి చేసినట్టు సమాచారం.

ఇరాన్ కు బుద్ది చెప్పాలని అమెరికా ప్లాన్ ప్రకారం ఇరాన్ దేశ రాకెట్లు, మిసైల్ లాంచర్లను నియంత్రించే కంప్యూటర్ వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్టు సమాచారం. ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్ కంప్యూటర్లను టార్గెట్ చేసి ట్రంప్ ప్రభుత్వం ఈ సైబర్ దాడికి దిగినట్టు తెలుస్తోంది.

పదేళ్ల క్రితం కూడా అమెరికా-ఇజ్రాయిల్ లు ఇలా ఇరాన్ పై స్టక్స్ నెట్ కంప్యూటర్ వైరస్ ను సృష్టించి ఇబ్బందుల పాలు చేశాయి. ఇక ఇరాన్ హ్యాకర్లు కూడా అమెరికాలోని ఆర్థిక, చమురు, గ్యాస్ తదితర రంగాల కంపెనీలను లక్ష్యంగా దెబ్బతీస్తున్నారు. ఇలా రెండు దేశాల మధ్య ఇప్పుడు సైబర్ యుద్ధం నడుస్తోంది. అయితే అమెరికా సైబర్ దాడులపై ఇరాన్ ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. యుద్ధానికి వస్తే మాత్రం అమెరికా సైనికులు ప్రాణాలపై ఆశలు వదలుకోవాల్సిందేనని.. ట్రంప్ జాగ్రత్తగా అడుగులేయాలని ఇరాన్ ఓ హెచ్చరికను పంపింది.