Begin typing your search above and press return to search.

అదానీ చేతికి అంబుజా సిమెంట్..భారీ డీల్ తో సొంతం..

By:  Tupaki Desk   |   16 May 2022 10:36 AM GMT
అదానీ చేతికి అంబుజా సిమెంట్..భారీ డీల్ తో సొంతం..
X
ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్న ఇండియన్ బిజినెస్ మ్యాన్ అదానీ మరో భారీ డీల్ కుదుర్చుకున్నారు. దేశంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీలైన ఏసీసీ, అంబుజాలను సొంతం చేసుకున్నాడు. ఓపెన్ ఆఫర్ లో వెయ్యి డాలర్లకు కోట్ చేసిన అదానీ గ్రూప్ ఈ కంపెనీలను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా హోల్సిమ్ లిమిటెడ్ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. హోలిమ్స్ కంపెనీకి అంబుజా సిమెంట్  ఈక్విటీలో 63.19 శాతం, ఏసీసీ ఈక్విటీలో 54.53 శాతం వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. భారత సిమెంట్ కంపెనీలో ఇది అతిపెద్ద డీల్ గా భావిస్తున్నారు. మరోవైపై అదానీ గ్రూప్ ఇంత పెద్ద డీల్ చేయడం ఇాదే మొదటిసారి.

స్విట్జర్లాండ్ దేశానికి చెందిన హోలిమ్స్ కు అంబుజా సిమెంట్ ఈక్విటీలో 63.19 శాతం, ఏసీసీ ఈక్విటీలో 54.53 శాతం వాటా ఉండేది. ఇప్పుడు భారత్ కు చెందిన అదానీ గ్రూప్ సొంతం చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.

అయితే సిమెంట్ కంపెనీ దిగ్గజాలైన అల్ట్రాటెక్, జేఎస్ డబ్ల్యూ కూడా అంబుజా సిమెంట్ వాటాను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డాయి. అయితే అదానీ గ్రూప్ వాటి కన్నా అత్యధిక ధర 1,050 కోట్ల డాలర్లు (రూ.81,360 కోట్లు) ను కోట్ చేయడంతో వాటిని సొంతం చేసుకుంది.  దీంతో ఈ రెండు కంపెనీలు దేశంలో సిమెంట్ ఉత్పత్తిల్లో రెండో స్థానాన్ని అక్రమించే అవకాశం ఉంది. మొదటి స్థానంలో అల్ట్రాటెక్ దూసుకుపోతోంది.

ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ త్వరలో ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. అంబుజా సిమెంట్ ఈక్విటీని రూ.385, ఏసీసీ షేర్ ను రూ.2,300 చొప్పున కొనుగోలు చేసిన తరువాత మరో 26 శాతం వాటా విక్రయానికి ప్లాన్ వేస్తోంది. సిమెంట్ రంగంలోకి అదానీ ఇటీవలే ప్రవేశించాడు.

అదానీ సిమెంట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీనీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అంబుజా, ఏసీసీలో అదానీ వశం కావడంతో మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే అంబుజా, ఏసీసీ కంపెనీల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 6.6 కోట్ల టన్నులు. అల్ట్రాటెక్ కంపెనీ తప్ప మరొకటి ఇంత ఉత్పత్తి చేయలేదు.

ఏసీసీ కంపెనీకి దేశవ్యాప్తంగా 17 సిమెంట్ యూనిట్లు ఉన్నాయి. ఈ కంపెనీ విద్యుత్ అవసరాల కోసం సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంది. ఈ కంపెనీలో దేశ వ్యాప్తంగా 6 వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే 56 వేల మంది డీలర్లు ఉన్నారు. అంబుజా సిమెంట్స్ మొత్తం 31 మిలియన్ టన్నుల సామర్థ్యం గల 6 యూనిట్లు ఉన్నాయి. అలాగే 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు ఏర్పాటు చేసింది.