Begin typing your search above and press return to search.

వైరల్ : ఇంద్రభవనంలా హైదరాబాద్ 'అమెజాన్'

By:  Tupaki Desk   |   17 Jan 2022 12:03 PM GMT
వైరల్ : ఇంద్రభవనంలా హైదరాబాద్ అమెజాన్
X
ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అమెరికా వెలుపల తొలి కార్యాలయాన్ని నిర్మిస్తోంది. ఇంద్ర భవనాన్ని తలపించేలా ఆ నిర్మాణాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తోంది. భారతదేశంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. అత్యధిక జనాభా కలిగిన మన దేశాన్ని కేంద్రబిందువుగా చేసుకొని... వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఓ కార్యాలయాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తోంది.

హైదరాబాద్ గచ్చిబౌలి లో అమెజాన్ కార్యాలయం ముస్తాబు అవుతుంది. 2015లో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాద్ 'అమెజాన్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. 'ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ ఆఫీస్ ఎక్కడ ఉంది' అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్ పట్ల ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యారు. అమెజాన్ ఆఫీసుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. అతిపెద్ద క్యాంటీన్ అనగా... 2700 మంది ఒకేసారి భోజనం చేసేలా డిజైన్ చేశారు. ఇక ఆపీసులో ఒకేసారి 15 వేల మంది ఉద్యోగులు పనిచేసే సౌకర్యాలు ఉన్నాయి. హై స్పీడ్ లిఫ్టులను కూడా ఏర్పాటు చేశారు. 49 హై స్పీడ్ లిఫ్టులు ఉండగా.. ప్రతి ఫ్లోర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చి దిద్దారు.

ఈ విధంగా అమెజాన్ ఆఫీసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అమెజాన్ హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు అనడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంద్రభవనం లాగా ఉన్న అమెజాన్ కార్యాలయం పై మీరు ఓ లుక్కేయండి...!