Begin typing your search above and press return to search.

గూగుల్.. అమెజాన్ లకు 72 గంటల డెడ్ లైన్ ఇచ్చిన మోడీ సర్కార్

By:  Tupaki Desk   |   7 July 2020 6:50 AM GMT
గూగుల్.. అమెజాన్ లకు 72 గంటల డెడ్ లైన్ ఇచ్చిన మోడీ సర్కార్
X
వరుస పెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ సర్కారు.. తాజాగా ఇండియాఈ కామర్స్ లో భారీ ఎత్తున బిజినెస్ చేస్తున్న రెండు పెద్ద కంపెనీలకు ఊహించనిరీతిలో డెడ్ లైన్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించాలని స్పష్టం చేయటంతో పాటు.. ఇప్పటివరకూ తమ వద్ద ఉన్న వినియోగదారుల డేటాను తమకు ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది.

అంతేకాదు.. తాము కోరిన సమాచారాన్ని తమకు ఇచ్చేందుకు 72 గంటల డెడ్ లైన్ ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. తాము జారీ చేసిన ఆదేశాలు జాతీయ భద్రతకు సంబంధించినదని చెప్పిన ప్రభుత్వం.. కొత్త ఈ కామర్స్ పాలసీ ముసాయిదాను తెర మీదకు తీసుకొచ్చింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏ ఈ-కామర్స్ సంస్థ అయినా సరే తమ వద్ద ఉన్న కస్టమర్ల డేటాను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది.

ఇన్ని సంవత్సరాలుగా తమకు తగ్గట్లుగా వ్యవహరించిన ఈ పెద్ద సంస్థలకు తాజాగా తీసుకున్న నిర్ణయం మింగుడుపడనిది మారుతుందని చెబుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా గూగుల్.. అమెజాన్ లాంటి ఈ-కామర్స్ కంపెనీల జోరు పెరుగుతుంటే.. అదే సమయంలో దేశీయ కంపెనీల వేగం తగ్గినట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం.. తాజాగా తన చర్యలతో దిద్దుబాటు చర్యల్ని చేపట్టినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు ఈ- కామర్స్ రెగ్యులేటర్ ను నియమించటం ద్వారా ఈ రంగంలో పోటీ తత్త్వం పెరిగేలా చర్యలు తీసుకున్నట్లైంది.

గడిచిన కొంత కాలంగా డిజిటిల్ చెల్లింపులు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని మరింత పెంచేలా తాజాగా విరుచుకుపడుతన్న మహమ్మారి పుణ్యమా అని ఈ-పేమెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దేశంలో వంద కోట్ల మంది డిజిటల్ యాప్ లను వాడుతున్నారు. వారికి సంబంధించిన డేటా ఏదీ ప్రభుత్వం వద్ద లేదు. అదే సమయంలో ఈ యాప్ లలో అత్యధికం విదేశాలకు చెందినవే. దీని కారణంగా వీటి ద్వారా వచ్చే ఆదాయం పెద్ద ఎత్తున విదేశాలకు తరలి వెళుతోంది. ఈ నేపథ్యంలో సదరు కంపెనీల డేటా తన వద్ద ఉంచుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా తాజా అల్టిమేటం ఇచ్చినట్లు చెబుతున్నారు. కేంద్రం కోరినట్లుగా 72 గంటల్లో తన దగ్గరి డేటాను సదరు కంపెనీలు ఇస్తాయా?అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.