ఆధార్ లేకుంటే అన్ని పథకాలు బంద్.. నిబంధనలు కఠినతరం

Wed Aug 17 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

All schemes will be shut down if aadhaar is not there.

దేశంలో ఇప్పుడు అన్నింటికి 'ఆధార్' అవసరం. అది లేకుంటే ఏ పని కాదు.. ఆధార్ కార్డు లేకుంటే ఎటువంటి ప్రయోజనాలు అందవు.. సబ్సిటీలు దరిచేరవు. ప్రభుత్వ ప్రయోజనాలు దక్కాలంటే ఆధార్ ఉండి తీరాల్సిందే.దేశంలో ఆధార్ నంబర్ ను జారీ చేసే ప్రభుత్వ సంస్థ అయిన యూఐడీఐ తన తాజా సర్య్కూలర్ లో కొన్ని కఠిన నిబంధనలు పొందుపరిచింది. గత వారమే అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్రప్రభుత్వాలకు పంపింది.

2022 ఆగస్టు 11న యూఐడీఏఐ జారీ చేసిన సర్క్యూలర్ లో గతంలో కంటే ఆధార్ నిబంధనలను కఠినతరం చేసింది. ఆధార్ నంబర్ లేని వారు ఇకపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సబ్సిడీని పొందలేరని అందులో స్పష్టంగా పేర్కొంది. కులం ఆదాయం మొదలైన వాటికి సంబంధించిన ప్రభుత్వ ధృవపత్రాలు కూడా ఆధార్ నంబర్ జారీ చేయబడవని వెల్లడించింది.

ఇక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రాయితీలు ఇతర ప్రభుత్వ సేవలను పొందేందుకు అర్హతను ఆధార్ నిర్ణయిస్తుందని తేటతెల్లం చేసింది. ఆధార్ నంబర్ లేని వ్యక్తులు ప్రత్యామ్మాయ గుర్తింపు మార్గాల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రాయితీలు లేదా సేవలను అందించవచ్చని ఈ విభాగంలో నిబంధన ఉంది.

ప్రస్తుతం దేశంలో 99శాతం మంది వయోజన పౌరులకు ఆధార్ నంబర్లు జారీ చేసినట్లు సర్క్యూలర్ యూఐడీఏఐ తెలిపింది. ఇప్పటికీ ఆధార్ నంబర్లు లేనివారు  నమోదు చేసుకోవాలని సూచించింది. ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం దాని స్లిప్ లో కనిపించే ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ను ప్రత్యామ్మాయ పద్ధతిగా ఉపయోగించుకోవచ్చు.

ఈ ఆధార్ నంబర్ లేకపోతే అన్ని ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయని యూఐడీఏఐ తెలిపింది. సో ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ ఆధార్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది.