Begin typing your search above and press return to search.

కేజీ టు పీజీ .. జులై 1నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభం !

By:  Tupaki Desk   |   19 Jun 2021 1:29 PM GMT
కేజీ టు పీజీ ..  జులై 1నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభం !
X
ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం అయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కరోనా మహమ్మారి దాదాపుగా తగ్గిపోయిన నేపథ్యంలో రేపటి నుండి పూర్తి లాక్‌ డౌన్‌ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల వ్యవస్థలు సాధారణ స్థితిలోకి రానున్నాయి. వీటితో పాటు విద్యావవస్థపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జూలై 1వ తేదీ నుంచి స్కూళ్లు రీ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. థర్డ్ వేవ్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న.. కేజీ టు పీజీ వరకు అన్నీ విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని స్పష్టంచేసింది. అయితే వీటి నిర్వహాణపై పూర్తి విధివిధానాలు వెలువడాల్సి ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం విద్యా సంస్థలు మూత పడడంతో ప్రైవేటు టీచర్లతో పాటు అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సరైన ఇంటర్‌ నెట్ సౌకర్యం లేక కనీస క్లాసులకు కూడా హజరు కాలేక పోయారు. అయితే ఈ విద్యా సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి రాకుండా ముందే నిర్ణయం తీసుకున్నారు.కాని ముఖ్యంగా కరోనా మూడో వేవ్ విద్యార్థులు, చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందంటూ వస్తున్న నిపుణుల సూచనలతో చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే అన్ని విద్యా సంస్థల అంటే ప్రాధమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విద్యాలయాలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫిజికల్ అటెండెన్స్‌ తో విద్యా సంస్థలు తెరుచుకుంటాయా, లేక ఆన్‌‌లైన్ ద్యార క్లాసులు ప్రారంభమవుతాయా అనేది వేచి చూడాలి.మరోవైపు దాదాపు పట్టణ ప్రాంతంలోని ప్రైవేటు విద్యా సంస్థలు తమ పిల్లలకు అన్‌లైన్ క్లాసులను బోధించేందుకు సన్నధ్దమయ్యాయి. అందుకు సంబంధించిన సర్క్యూలర్స్‌ కూడా జారీ చేశాయి. అయితే విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించేలా తప్పనిసరిగా ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించారు. తొలుత ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు దాన్ని పొడిగిస్తూ వచ్చారు.