బ్రేకింగ్ న్యూస్ : దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు

Fri Dec 06 2019 07:41:48 GMT+0530 (IST)

All 4 accused in Hyderabad vet rape and murder accused killed in police encounter

సంచలనం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యాచారం ఉదంతంలో ప్రజలంతా కోరుకున్నదే జరిగిందా? పిచ్చి పిచ్చి వేషాలు వేసినా.. ఘోరాపచారం చేస్తే.. వ్యవస్థ చూస్తూ ఊరుకోదన్న బలమైన సందేశం ఇవ్వకనే ఇచ్చినట్లైంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యోదంతం కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశను కాల్చి చంపిన ప్రాంతానికి సమీపంలోనే నిందితుల్ని పోలీసులు కాల్చేశారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే ప్రయత్నంలో భాగంగా నిందితుల్ని చర్లపల్లి జైలు నుంచి ఘటనాస్థలానికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో నిందితులు నలుగురు పారిపోయే ప్రయత్నం చేశారని.. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరపాల్సి వచ్చిందంటున్నారు. ఈ క్రమంలోనే నిందితులు నలుగురు మరణించినట్లుగా సమాచారం. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యోచారం నేపథ్యంలో నిందితుల్ని బహిరంగంగా ఉరి తీయాలని.. ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్లు వచ్చాయి. అందుకు తగ్గట్లే తాజా పరిణామం చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాల్ని పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.