Begin typing your search above and press return to search.

అల‌ర్ట్ః స‌బ్జా గింజ‌ల నీళ్లు తాగితే జ‌రిగేది ఇదే!

By:  Tupaki Desk   |   18 April 2021 11:30 PM GMT
అల‌ర్ట్ః స‌బ్జా గింజ‌ల నీళ్లు తాగితే జ‌రిగేది ఇదే!
X
క‌రోనా గోల‌లో ప‌డి దేశం వేస‌వి గురించే మ‌రిచిపోయింది. ఈ పాటికి ఎండ‌లపై, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఎన్నో స‌ల‌హాలు, సూచ‌న‌లు వ‌స్తుండేవి. కానీ.. కొవిడ్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు అన్ని విష‌యాల‌నూ ప‌క్క‌న‌బెట్టి, క‌నిపించ‌ని సూక్ష్మ‌జీవితో పోరాటం చేస్తున్నారు. అయితే.. మిగిలిన ఉప‌ద్ర‌వాల‌ను కూడా కాచుకోవ‌డం అత్య‌వ‌స‌రం.

ఎండ‌లు తీవ్ర‌స్థాయిలో మండిపోతున్నాయి. ఇవాళ దాదాపు 36 డిగ్రీల వేడిని ప్రొడ్యూస్ చేస్తున్నాడు సూర్యుడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంది. క‌రోనా, ఎండ నేప‌థ్యంలో జ‌నాలు సాధ్య‌మైనంత వ‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది. కానీ.. అత్య‌వ‌సరాల నేప‌థ్యంలో బ‌య‌ట‌కు వెళ్తే బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం కంప‌ల్స‌రీ.

దీనికోసం ద్ర‌వ‌ప‌దార్థాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. అయితే.. కేవ‌లం నీళ్లు మాత్ర‌మే కాకుండా ఇత‌ర మేలైన‌ ఇంగ్రీడియంట్స్ తీసుకోవ‌డం ద్వారా ఆరోగ్యాన్ని చ‌క్క‌గా కాపాడుకోవ‌చ్చు. అందులో ఒక‌టి స‌బ్జా గింజ‌లు. చెర‌కు ర‌సాల్లో ఈ మ‌ధ్య విరివిగా వినియోగిస్తున్నారు. ఈ స‌బ్జా గింజ‌లు తీసుకోవ‌డం ద్వారా ఒంటికి ఎన్నో ర‌కాలుగా మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

స‌బ్జా గింజ‌లు వేసిన నీటిని, ద్ర‌వ‌ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం ద్వారా.. ప్ర‌ధానంగా ఒంట్లో వేడి త‌గ్గుతుంది. దీన్ని రెగ్యుల‌ర్ గా తీసుకుంటే. మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. అంతేకాకుండా.. అధిక బ‌రువు కూడా త‌గ్గించుకోవ‌చ్చు. ఇంకా.. మ‌ధుమేహం, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లనూ అదుపులో పెట్టుకోవ‌చ్చు. వికారం, వాంతి ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్క‌డంతోపాటు గొంతు మంట‌, ద‌గ్గు, ఆస్త‌మా, త‌ల‌నొప్పి వంటి ఎన్నో స‌మ‌స్య‌ల‌నుంచి ఈ స‌బ్జా గింజ‌లు కాపాడుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

విట‌మిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఈ నీటిని తాగ‌డం ద్వారా.. దేహానికి చ‌క్క‌టి ఆరోగ్యం స‌మ‌కూరుతుంద‌ని చెబుతున్నారు. అందువ‌ల్ల దుకాణానికి వెళ్తే.. ఇవి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేయండి. దానిక‌న్నా ముందు.. మాస్కు వేసుకోవ‌డం, శానిటైజ్ చేసుకోవ‌డం మాత్రం మ‌ర‌వ‌కండి.