Begin typing your search above and press return to search.

అలర్ట్‌‌: మద్యం సేవిస్తే… పిల్లలు పుట్టరా?

By:  Tupaki Desk   |   23 Jan 2023 6:00 PM GMT
అలర్ట్‌‌: మద్యం సేవిస్తే… పిల్లలు పుట్టరా?
X
అతిగా తినటం, అతిగా తాగటం అనర్ధం. అతిగా తింటే పొట్ట వస్తుంది. అతి తాగితే టెస్టోస్టిరాన్‌ స్థాయి తగ్గిపోతోంది. ఇదేదో సరదా కోసం చెప్పింది కాదు. ఓ ప్రముఖ శాస్త్రవేత్తల అధ్యయనంలో భయటపడిన సంచలన విషయం. తినటం వల్ల పొట్ట వచ్చేదాని గురించి ఇప్పటికే అందరికీ తెలుసు. కానీ.. మద్యం వల్ల వచ్చే ఇంత పెద్ద అనర్ధం గురించి అసలు తెలియదు. మద్యం తాగితే.. శరీరంలో అవయవాలు పాడై ప్రాణాపాయం రావచ్చని విన్నాం కానీ....… సెక్స్‌లో ఈ సమస్య వస్తోందని కలలో కూడా ఊహించి ఉండరు మందుబాబు. మద్యం ఎంత తాగాలి? అసలు తాగాలా వద్దా అనే విషయాలు ఇప్పుడు చర్చిద్దాం.

దేశ వ్యాప్తంగానే కాక… ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు మందు బాబుల సంఖ్య పెరిగిపోతోంది. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల వల్ల తాగే వారు కొందరైతే… తాగడమే పనిగా పెట్టుకునే వారు మరికొందరు. గడిచిన దశబ్ద కాలంలో యువతలో మద్యం సేవించే అలావాటు బాగా పెరిగిపోయింది. కేవలం పురుషులు మాత్రమే కాదు.. మహిళల్లోనూ మద్యం పట్ల…. మోజు చూపుతున్నారు.

వీకెండ్‌ వచ్చిందంటే చాలు పుల్‌గా తాగి… తూగుతుంటారు. ఇప్పుడు మందు తాగేందుకు వయసుతో నిమిత్తం లేకుండా పోయింది. జండర్‌తో అసలే పని లేదు. ఏ నువ్వు తాగితే నేను తాగకూడదా అనే స్థాయికి భార్య, భర్తలు వచ్చిన సందర్భాలు అనేకం. అయితే……. అతిగా మద్యం సేవించటం వల్ల పురుషుల్లో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఓ అధ్యనయంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

మద్యం ఎక్కువ మొత్తంలో సేవిస్తే శుక్ర కణాల సంఖ్య తగ్గుతుంది. మద్యం సేవిస్తే పురుషుల్లో సంతానలేమి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2019లో అమెరికాలో ఓ అధ్యయనం జరిగింది.

అందులో 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మగవారిలో మద్యం తాగినవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు గుర్తించారు. అత్యధిక ఆల్కహాల్ తీసుకోవడం అంటే. 3-4 గ్లాసు ఆల్కహాల్ వారానికి 7-14 గ్లాసుల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య తక్కువ అవుతున్నట్లు తేలింది.

ఆండ్రాలజీ జర్నల్‌లో మరో అధ్యయన నివేదిక ప్రచురితమైంది. ఈ అధ్యయన నివేదిక ప్రకారం 323 మంది పురుషులను టెస్ట్‌ చేర్చారు. వారిని 4 గ్రూపులుగా విభజించారు. విపరీతంగా మద్యం సేవించే వారు…….. మితమైన మద్యపానం చేసేవారు, అతి తక్కువ మద్యం తీసుకునేవారు, మద్యం అసలు తీసుకోని వారు. ఆల్కహాల్ మితంగా తాగడం వల్ల…. వీర్య కణాల ఆరోగ్యానికి మంచిదని, అదే అతిగా మద్యం సేవించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్లు తేలింది. ఇది భవిష్యత్తులో వంధ్యత్వానికి దారితీస్తున్నట్లు వెల్లడైంది.

అతిగా మందు తాగడం వల్ల హార్మోన్లు తగ్గుతాయి. అలా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. పురుషాంగం కుంచించుకుపోయి సంతానలేమికి కారణం అవుతుంది. గోనడోట్రోపిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. శీఘ్ర స్కలనం ఏర్పడుతుంది. అతిగా మందు తాగడం వల్ల స్మెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించే… జీవులు కాస్త జాగ్రత్తలు ఉండాలని ఈ అధ్యయానాలు చెబుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.